టాలీవుడ్ లో సీనియర్ హీరో నందమూరి బాలక్రిష్ణ. ఆయన తన తండ్రి ఎన్టీయార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వందకు పైగా సినిమాలు నటించిన బాలయ్య కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ తరంలో పౌరాణిక జానపద, చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో నటించిన ఏకైక కధానాయకుడు బాలయ్య అని చెప్పాలి. బాలయ్యకు ఇపుడు సరైన హిట్ పడాలి. బాలయ్య వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత మళ్ళీ ఆ రేంజి హిట్ అయితే లేదు. ఇక బాలయ్య 2019 లో మొత్తం మూడు సినిమాలు చేస్తే అన్నీ కూడా దారుణంగా నిరాశ పరచాయి. కధానాయకుడు, మహా నాయకుడు మూవీస్ ఎన్టీయార్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తే అనూహ్యంగా ఫట్ అయ్యాయి. ఇక అదే ఏడాది డిసెంబర్లో బాలయ్య చేసిన రూలర్ సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందించింది.
ఈ నేపధ్యంలో బాలయ్యతో బ్యాక్ టూ బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన పక్కా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్థున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఈ మూవీకి అన్నీ కుదిరాయని అంటున్నారు. బోయపాటి కూడా వినయ విధేయ రామా ఫ్లాప్ తరువాత కసిగా ఈ మూవీని చేశారని చెబుతున్నారు. చిత్రమేంటి అంటే అటు బోయపాటికి ఇటు బాలయ్యకు ఇద్దరికీ ఇపుడు బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. దాంతో అఖండ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.
కరోనా కనుక లేకుండా ఉంటే ఈ పాటికి అఖండ సమ్మర్ కి రిలీజ్ అయ్యేది. కానీ ఆ తరువాత ఇపుడు అన్నీ మెల్లగా సర్దుకుంటున్నాయి. దాంతో అఖండ మూవీని ఎపుడు రిలీజ్ చేస్తారు అన్న చర్చ అయితే ఫ్యాన్స్ లో ఉంది. ఈ మూవీ బంపర్ ఆఫర్ లాంటి దసరా ఆఫర్ ని వదులుకుంది అన్న మాట అయితే ఉంది. అయితే ఏపీలో టికెట్ల విషయంలో ఇంకా డెసిషన్ ఏదీ తేలలేదు. దాంతో అఖండ అలా ఆగింది. కానీ ఇపుడు దీపావళి అంటున్నారు. దీపావళి రిలీజ్ డేట్ తప్పితే మళ్ళీ ఈ మూవీకి సమ్మర్ దాకా స్లాట్ దొరికే చాన్సే లేదు. ఎందుకంటే 2022 సంక్రాంతికి కర్చీఫులు పెద్ద ఎత్తున పడిపోయాయి. పైగా ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి.
దాంతో దీపావళికే అఖండ నూరు శాతం ధియేటర్లలో సందడి చేస్తారు అంటున్నారు. ఒక విధంగా చూస్తే పెద్దగా పోటీ కూడా దీపావళికి లేదు కాబట్టి అఖండ టాక్ బాగుంటే బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు. ఇక అదే కనుక జరిగితే బాలయ్య కెరీర్ రెట్టించిన స్పీడ్ తో పరుగులే పెడుతుంది అంటున్నారు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని మూవీ, ఆ తరువాత అనిల్ రావిపూడి మూవీ కూడా బాలయ్య చేయనున్నాడు. ఇలా హిట్ల మీద హిట్లకు అఖండ దారి చూపుతుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.