2019 సంక్రాంతి బరిలో దిగిన నాలుగు చిత్రాల్లో `ఎఫ్ 2` మాత్రమే విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 130 కోట్ల వసూళ్లు సాధించింది. వెంకీ, వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. దిల్ రాజు నిర్మాణ సంస్థలో బెస్ట్ సినిమా కూడా ఇదే. అందుకే ఈ సినిమా సక్సెస్ ని దిల్ రాజు ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిన్నటి సాయంత్రం ఎఫ్ 2 అర్థ శతదినోత్సవ వేడుకను హైదరాబాద్ దసపల్లాలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుక వేళ ఓ ఆసక్తికర సంగతి తెలిసింది. `ఎఫ్ 2: ఫన్ & ఫ్రస్టేషన్` చిత్రం ఇంత పెద్ద సక్సెసైన నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ కథ రాసేందుకు అనీల్ రావిపూడి ఇప్పటినుంచే ప్రిపరేషన్ లో ఉన్నారా? అంటే అవుననే సమాచారం. అతడితో పాటు రైటర్ల బృందం ఆర్నెళ్ల గ్యాప్ తర్వాత పూర్తి స్థాయిలో బరిలో దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ప్లానింగ్ లోనే ఉన్నారు. 2021లో ఈ సినిమా సెట్స్ కెళ్లే వీలుందని తెలుస్తోంది. ఈలోగా దిల్ రాజు కమిట్ మెంట్లు, అనీల్ రావిపూడి ఇతర కమిట్ మెంట్లు పూర్తవుతాయి. అటుపై కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారట. `ఎఫ్ 2` అనేది `హౌస్ ఫుల్` సిరీస్ తరహాలో ఆద్యంతం వినోదం పంచే ఫ్రాంఛైజీ. ఇందులో ఎన్ని సినిమాలైనా తీసేందుకు కొనసాగించేందుకు ఆస్కారం ఉంది. ఇదే పాయింట్ సరిగ్గా అనీల్ రావిపూడికి కలిసి రానుంది. అది వెంకీ, వరుణ్ తేజ్ లకు ప్లస్ అవుతుంది. ఇక ఈ ఫ్రాంఛైజీలోకి కొత్త హీరోలు వచ్చి చేరే వీలుంటుందని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు తరలించే సత్తా ఉన్న ఫ్రాంఛైజీ ఇదన్న చర్చా సాగుతోంది.
ఎఫ్ 2 విజయోత్సవ వేదికపై దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ``107 కేంద్రాల్లో 50 రోజులు ఆడటమే కాదు.. 130 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. నేను చేసిన నాలుగు సినిమాల్లో ఆడుతూ పాడుతూ, నవ్వుకుంటూ చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో నవ్వు అంటే మరింత గౌరవం పెరిగింది. నా సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట ఉంటుంది. అందుకనే నా జోనర్ ని వదులుకోను. ఇంతగా నవ్వుకు ప్రాధాన్యతనివ్వడానికి కారణం నాకు గురువుల్లాంటి జంధ్యాలగారు, ఈవీవీగారు, ఎస్.వి.కృష్ణారెడ్డిగారి సినిమాలు .. వాటి స్ఫూర్తి. నా సినిమాల్లో కామెడీ ఉండేలా చూసుకుంటున్నాను. వాళ్ల సినిమాలకు నేను పనిచేయకపోయినా, వాళ్ల సినిమాలే నాకు లైబ్రరీ. వాళ్లు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు`` అని తెలిపారు. చాలా కాలానికి జంధ్యాల, ఈవీవీ లేని లోటు అనీల్ రావిపూడి తీరుస్తున్నారు కాబట్టి ఎఫ్ 2 ఫ్రాంఛైజీకి ఆదరణ అంతే ఇదిగా ఉంటుందనడంలో సందేహమే లేదు.