చిన్న సినిమాలకు అండ.. ఈ మాట వినగానే గుర్తొచ్చే వచ్చి దాసరి నారాయణ రావు. ఆయన తప్ప మరే పేరు గుర్తురాకపోయినా ఆశ్చర్యమేమీ లేదు. లో బడ్జెట్ సినిమాల తరపున అనుక్షణం గొంతు వినిపిస్తారాయన. ఆ స్థాయిలో ఇండస్ట్రీ జనాలను ఎండగట్టేందుకు ఆయన రెడీ.
థియేటర్లను లీజ్ కు తీసుకుని.. రిలీజ్ లను నియంత్రించడం అనే అంశాన్ని ముందు నుంచి వ్యతిరేకించారు దాసరి నారాయణ రావు. ఎప్పుడు చిన్న సినిమాకు సమస్య వచ్చినా.. ఆయన దృష్టికి తీసుకు వెళ్లగలిగితే విడుదలకు అడ్డంకులు తొలగేందుకు ప్రయత్నించేవారు. అవసరమైతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ లతో లాబీయింగ్ కు కూడా రెడీ అయిపోయేవారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొందరు నిర్మాతల చేతుల్లో చిక్కుకుపోవడాన్ని ఆయన నిరంతంరం ఖండించేవారు. ఇండస్ట్రీలో ఎంతటి శక్తివంతులైనా.. సీనియర్లు అయినా ఎదిరించేందుకు దాసరి ఏనాడూ మొహమాటపడలేదు.
అలాగే వయసు.. అనుభవం.. స్థాయి రీత్యా ఆయనను సినీ జనాలు అంతా గాడ్ ఫాదర్ గా చూసుకుంటాయి. ఏ స్థితిలోనూ ఆయన మాటను కాదని చెప్పిన సందర్భాలు లేవు. ఇప్పుడు అంతటి అండను చిన్న సినిమా కోల్పోయింది. దాసరి మరణం అందరికంటే ఎక్కువగా బాధించేది స్మాల్ ఫిలిం మేకర్స్ నే. ఎందుకంటే ఇకపై ఆ స్థాయిలో గొంతు వినిపించగలిగే మరో శక్తి టాలీవుడ్ లో లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/