స్పీడు తగ్గిన మైత్రి జోరు

Update: 2019-07-08 06:14 GMT
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద బ్యానర్ అయినా నాలుగైదేళ్లలో ఓ స్టార్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అరుదు. అలాంటిది ముగ్గురు అగ్ర హీరోలతో విడివిడిగా సినిమాలు తీసి సంస్థను స్థాపించిన తక్కువ కాలంలో బ్లాక్ బస్టర్స్ అందుకోవడం చిన్న విషయం కాదు. మైత్రి దాన్ని సాధ్యం చేసి చూపించింది. మహేష్ బాబు శ్రీమంతుడుతో మొదలై జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో కొనసాగించి రామ్ చరణ్ రంగస్థలంతో పీక్స్ లోకి వెళ్లిపోయింది మైత్రి మూవీ మేకర్స్.

ఆ ఉత్సాహంతో వరసబెట్టి ప్రాజెక్టులు కాంబినేషన్లు సెట్ చేసుకుని ఇబ్బడి ముబ్బడిగా అడ్వాన్సులు ఇచ్చేసుకున్న మైత్రికి గత ఏడాది సెకండ్ హాఫ్ మంచి పాఠాలు నేర్పించింది. నాగ చైతన్య సవ్యసాచి రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ రెండూ డిజాస్టర్ కావడం ఊహించనిది. అవి కాకుండా డియర్ కామ్రేడ్ ఆలస్యం కావడం తొలుత అనుకున్న పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయ ఎంట్రీ వల్ల క్యాన్సిల్ చేసేయడం లాంటివి చాలానే జరిగాయి

అందుకే మైత్రి సంస్థ ఇప్పుడు దూకుడు తగ్గించేసినట్టుగా కనిపిస్తోంది. సాయి తేజ్ తమ్ముడు వైష్ణప్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఉప్పెన షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. డియర్ కామ్రేడ్ రిలీజ్ కు రెడీ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన పనులేవీ పెండింగ్ లో లేవు. అందుకే గతంలో కమిట్ అయిన వాళ్ల దగ్గర అడ్వాన్సులు వెనక్కు తీసుకునే పనిలో మైత్రిలో ముగ్గురు నిర్మాతలు ఉన్నట్టుగా ఫిలిం నగర్ టాక్. ఇకపై దూకుడుగా కాకుండా కొంత స్లో అయినా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లాలని అలోచించి ఆమేరకు నెమ్మదించినట్టుగా కనిపిస్తోంది.


Tags:    

Similar News