టాలీవుడ్ లో ఎందరో నిర్మాతల పుత్ర రత్నాలు హీరోలుగా ప్రయత్నించి కొన్నాళ్ల పాటు రాణించి ఆ తర్వాత వేరే వ్యాపారాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వడ్డే నవీన్ లాంటి హీరో సుదీర్ఘ కాలం సినిమాల్లో నటించినా అతడు కూడా ఇప్పుడు నటనకు దూరమయ్యారు. బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్ కి ఫ్లాపులొచ్చినా సినిమాలకు డోఖాల్లేవ్.
ఇకపోతే టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా తీస్తున్న ఓ అగ్ర నిర్మాత తన కుమారుడిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. ఓ యూత్ ఫుల్ డైరెక్టర్ చేతిలో కుమారుడిని పెట్టారు. ఈ ఏడాది చివరిలోనే లాంచ్ కావాల్సి ఉంది. కానీ ఎందుకనో కుదరలేదు. ఆ యూత్ ఫుల్ డైరెక్టర్ అడ్వాన్స్ తిరిగి వెనక్కిచ్చారు. మనసు మార్చుకుని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా వేరొక దర్శకుడి చేతిలోకి వెళ్లింది. అక్కడ కూడా పని ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందని తెలిసింది.
అసలు నిర్మాత సుపుత్రుని లాంచింగ్ కి ఎందుకు ఇన్ని అడ్డంకులు అంటే.. అంతా కరోనా మహిమ. ఏడాదిన్నరగా మహమ్మారీ కంటికి కునుకుపట్టనివ్వడం లేదు. దీని ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ విషయంలో ఏమాత్రం ఆలస్యమైనా దాని ప్రభావం కాన్ సీక్వెన్సెస్ ఇలానే ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.