రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచి సెలవు తీసుకున్నా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం టచ్ లోనే ఉంది. నిశ్చితార్థం తర్వాత కొందరు అభిమానుల విపరీతమైన కామెంట్లకు మనస్థాపం చెందినా వెంటనే కోలుకుని తనదైన శైలిలో నెటిజెన్లు అడిగిన ప్రశ్నలు సూటిగా సమాధానాలు ఇస్తోంది. పవన్ తో పూర్తిగా తెగతెంపులు ఉంటాయేమో అన్న సందేహాలను బ్రేక్ చేస్తూ తన ఇద్దరు సంతానానికి ఆయన తండ్రి కాబట్టి వారి భవిష్యత్తు కోసమైనా చర్చించేది ఉంటుంది కనక టచ్ లో ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. అంతే కాదు పిల్లల విషయంలో వేరే ఆప్షన్ కూడా లేదని చెప్పడం గమనార్హం. ఇదంతా లైవ్ లోనే జరిగింది.
సెలవులు వచ్చినప్పుడు ఏదైనా వేడుకలు ఉన్నపుడు అకీరా ఆద్యాలను పంపాల్సి ఉంటుంది కాబట్టి మాటలు ఉంటాయని తేల్చేసింది రేణు దేశాయ్. పవన్ విషెస్ చెప్పడం రేణు దేశాయ్ తాను పవన్ తో టచ్ లో ఉంటాను అని క్లారిటీ ఇవ్వడం ఇవన్నీ ఫాన్స్ కున్న అనుమానాలు పోగొట్టినట్టు అయ్యింది. అకీరా ఇటీవలే నాన్న పవన్ ను కలుసుకోవడానికి విజయవాడ దాకా రావడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. రేణు కూడా అకీరా పరిణితి చెందిన టీనేజర్ అని తన రెండో పెళ్ళికి వాడి అంగీకారం ఉందని స్పష్టం చేయటం తెలిసిందే. కేవలం 10 శాతం నెటిజెన్ల వల్లనే ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందే తప్ప అందరు తమ ప్రేమాభిమానాలతో మద్దతు తెలిపారని సంతోషం వ్యక్తం చేసారు.
ఇన్ని చెప్పిన రేణుక దేశాయ్ భర్త గురించి చెప్పడం చెప్పడం కానీ అతని ఫోటో షేర్ చేయటం కానీ చేయలేదు. అతని ఫోటో దొరక్క రేణుకతో తమ్ముడి పెళ్లిలో ఉన్న ఫోటోలను షేర్ చేసుకుని రచ్చ చేసిన అత్యుత్సాహవంతులు కూడా ఉన్నారు.మరి భర్త వివరాలు ఎప్పుడు బయట పెడుతుందో వేచి చూడాలి.