స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.
సమంత అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు పంచుకున్నప్పటి నుండి, అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి - ఎన్టీఆర్ - రామ్ పోతినేని - నాని - అడివి శేష్ - సాయి పల్లవి - రకుల్ ప్రీత్ సింగ్ - జాన్వీ కపూర్ - వంశీ పైడిపల్లి వంటి పలువురు సినీ ప్రముఖులు సామ్ అనారోగ్యంపై స్పందించారు. ఆమెను సూపర్ ఉమెన్ గా ధైర్యవంతురాలిగా కొనియాడుతూ.. ధైర్యం చెబుతున్నారు.
సమంత ఆరోగ్యం పై అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారని అందరూ వేచి చూసారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ మరియు అదే ఫ్యామిలీకి చెందిన సుశాంత్ సామ్ గురించి పోస్ట్ పెట్టారు. నీకు మరింత బలాన్ని శక్తి చేకూరాలని కోరుకుంటున్నా సామ్. నువ్వు దీన్ని అధిగమించగలవు అని సుశాంత్ ట్వీట్ చేశారు.
సామ్ ఇన్స్టాగ్రామ్ పోస్టుపై అఖిల్ స్పందిస్తూ.. 'డియర్ సామ్.. నీకు అందరి ప్రేమ మరియు మరింత ధైర్యం చేకూరలి' అని పేర్కొన్నారు. అయితే అక్కినేని నాగార్జున - మాజీ భర్త నాగచైతన్య సహా మిగతా కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారేంటని అందరూ ఆలోచిస్తున్నారు. అలానే దగ్గుబాటి కుటుంబం కూడా స్పందించలేదని అంటున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య-సమంతలు గతేడాది అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నాగార్జున మరియు చై ఇద్దరూ సామ్ గురించి పబ్లిక్ వేదికల్లో మంచి విషయాలే మాట్లాడారు. అందుకే, ఇప్పుడు సమంత త్వరగా కోలుకోవాలని నాగ్ గానీ, చైతన్య గానీ పబ్లిక్ గా కోరుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున తన మాజీ కోడలిని వ్యక్తిగతంగా కలవడానికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకు కోడలు విడిపోయినప్పటికీ.. సామ్ పట్ల తమ ఫ్యామిలీ అంతే ఆప్యాయత చూపిస్తుందని నాగ్ గతంలో చెప్పారు. కాబట్టి ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పనున్నారని అంటున్నారు.
ఇక సమంత ను చై కలుస్తాడా? మాజీ భర్తని కలవడానికి ఆమె ఆసక్తి చూపుతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. భార్యా భర్తలుగా విడిపోయి వేర్వేరు దారుల్లో నడిచినా స్నేహితులుగా కొనసాగుతామని చైతన్య-సామ్ పేర్కొన్నారు. ఇప్పుడు మాజీ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చైతూ స్పందించాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకపోయినా చైతన్య ఇప్పటికే సమంత ఆరోగ్యం గురించి ఆలోచించలేదని అనుకోవడం కరెక్ట్ కాదని మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు. నిజానికి ఈ సమయంలో ఎవరు ట్వీట్ చేశారు.. ఎవరు చేయలేదు అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సామ్ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా కోలుకోవడం ఇప్పుడు ముఖ్యం. ఆమె అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ ఇదే కోరుకుంటున్నారు.
సమంతా శనివారం సాయంత్రం ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ.. తనకున్న అరుదైన వ్యాధి గురించి తెలిపింది. తన ఆరోగ్య సమస్య సద్దుమణిగుతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేసింది. అన్ని సమస్యల్లాగే ఇది కూడా గడిచిపోతుందని సామ్ పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.