టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువమంది కొత్తవాళ్ళను అంటే హీరోలుగాని హీరోయిన్స్ గాని పరిచయం చేసిన దర్శకులలో తేజ ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ముప్పైఏళ్లకు పైనే అవుతున్నా తేజ ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరలేకపోయాడు. కానీ సినిమాలు మాత్రం గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నాడు. హిట్స్ ప్లాప్స్ పక్కనపెడితే తేజ ప్రతి సినిమాతో న్యూ ఆర్టిస్ట్ లను హీరోలుహీరోయిన్లను ఖచ్చితంగా పరిచయం చేస్తాడు. త్వరలోనే మరో హీరోహీరోయిన్లతో డెబ్యూ చేయించనున్నాడు. అయితే ఇప్పటివరకు దర్శకుడుగా తేజ ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండటం విశేషం.
లక్ష్మికళ్యాణంతో కాజల్ అగర్వాల్ - జయంతో నితిన్ - చిత్రంతో ఉదయ్ కిరణ్ - జై సినిమాతో నవదీప్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ.. సంగీత దర్శకుడుగా ఆర్పీ పట్నాయక్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. నిజానికి తేజ దర్శకుడుగా - ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. తాజాగా మరోసారి వీరి డెబ్యూ మూవీ 'చిత్రం' తెరమీదకు వచ్చింది. చిత్రం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు రెండు దశబ్దాల క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలైన 'చిత్రం' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ధర్మతేజ కాస్తా డైరెక్టర్ తేజ అయిపోయాడు.
అప్పటినుండి డైరెక్టర్ గానే ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ లో చాలా సినిమాలు చేసాడు. ఇటీవలే తేజ 'చిత్రం1.1' సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా చిత్రం సినిమాకు సీక్వెల్ గా రాబోతుందని సమాచారం. దాదాపు నలభైయైదు కొత్త యాక్టర్స్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ద్వారా దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆర్పీ పట్నాయక్ మరోసారి రీఎంట్రీ చేయనున్నాడు. మరి అప్పట్లో చిత్రం - జయం - నువ్వునేను - ఔనన్నా కాదన్నా - నిజం - లక్ష్మీకళ్యాణం ఇలా వీరి కాంబినేషన్ లో ఆడియో ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్స్. మరి ఈసారి 'చిత్రం1.1' మూవీతో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.