మనకు తెలుగులో సూపర్ హీరో.. సూపర్ హీరోయిన్ల సినిమాలు తక్కువే కానీ హాలీవుడ్లో అదో విజయవంతమైన జోనర్. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల వసూళ్లు కొల్లగొట్టే సక్సెస్ ఫుల్ మంత్రం. అందుకే సూపర్ హీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా డీసీ కామిక్స్ పాత్ర అయిన వండర్ వుమన్ ను ప్రధాన పాత్రలో చూపిస్తూ వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'వండర్ వుమన్ 1984'.
రెండేళ్ళ క్రితం 2017 లో విడుదలైన 'వండర్ వుమన్' సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో ఇజ్రాయల్ నటి గాల్ గాడోట్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. మానవాతీత శక్తులు కలిగిన అమెజాన్ యువరాణి పాత్రలో గాల్ గాడోట్ చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యే విడుదలైంది. "నా జీవితం మీరందరూ అనుకునే విధంగా లేదు" అంటూ ఒక వనిత చెప్పడంతోట్రైలర్ ప్రారంభం అవుతుంది. సినిమా 1984 లో జరుగుతుంది కాబట్టి ఆర్ట్ వర్క్ ఆ కాలానికి తగ్గట్టు ఉంది. వస్త్రధారణ.. ఆకాశ హర్మ్యాలు.. కార్లు.. తుపాకులు అన్నీ అప్పటివి. ట్రైలర్ లో ఆసక్తికరంగా అనిపించే అంశం. సోది ఆపి సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పుకుంటే హాలీవుడ్ రంగస్థలం అనుకోవచ్చు. అయితే ఇక్కడ సూపర్ హీరో లాంటి వండర్ వుమన్ కాబట్టి గాల్ గాడోట్ చేసే విన్యాసాలు ఈ తరహా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.
కొందరు షూట్ చేస్తూ ఉంటే ఆ తూటాలను గాల్ గోడాట్ తన శరీరంతో ఆపడం.. బంగారు రంగులో మెరిసే తన ప్రత్యేక ఆయుధంతో శత్రువులను మట్టు పెట్టడం ఆసక్తిని కలిగిస్తాయి. "అబద్దం నుంచి ఏం మంచి పుట్టదు"(డబ్బింగ్ వెర్షన్ వస్తే ఇట్టాంటి డైలాగ్ ఉంటుంది.. అలా కాకుండా మన భాషలో అయితే 'అబద్దంతో ఏం మేలు జరగదు').. లాంటి హాలీవుడ్ పంచ్ లు కూడా ఉన్నాయి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలస్యం ఎందుకు చూసేయండి. ఎప్పుడూ సూపర్ మ్యాన్.. ఆ మ్యాన్.. ఈ మ్యాన్ లేనా? ఈ వండర్ వుమన్ పై ఒక లుక్ వెయ్యండి.
Full View