కరోనా వల్ల దాదాపు ఏడాదిన్నర కాలం పాటు సినిమా ఇండస్ట్రీ లో థియేటర్ రిలీజ్ కనిపించలేదు. ఎట్టకేలకు పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా బాక్సాఫీస్ సందడి మొదలు అయ్యింది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా బాక్సాఫీస్ గలగల వినిపిస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ కు గత నెల నుండి కళ వచ్చింది. సౌత్ సినిమాలు కొన్ని ఈ ఏడాది సూపర్ హిట్ అయ్యాయి.. కాని బాలీవుడ్ లో మాత్రం ఈమద్యే సందడి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మళ్లీ వందల కోట్ల వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి అనేందుకు ఇటీవల వచ్చిన సినిమాలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇక ఈ వారం రాబోతున్న సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా శుక్రవారం విడుదల కాబోతుండగా.. స్పైడర్ మ్యాన్ ఒక రోజు ముందు అంటే రేపు విడుదల అవ్వబోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ శుక్రవారం విడుదల అవ్వబోతుండగా ఇండియాలో మాత్రం పుష్ప లక్ తో ముందు రోజే విడుదలకు సిద్దం అయ్యింది. స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్ కు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది. స్పైడర్ మ్యాన్ ప్రాంచైజీ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. వరల్డ్ బాక్సీఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు నమోదు చేసి టాప్ స్థానంలో నిలిచాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా గతంలో స్పైడర్ మ్యాన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందుకే ఈసారి కూడా స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ తో ఖచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ కు కరోనా తర్వాత ఊపు తీసుకు వస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామని అంటున్నారు.
విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్ మొదటి రోజు 30 కోట్ల రూపాయల నుండి 35 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించబోతుంది అంటున్నారు. కరోనా తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఏ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. కనుక స్పైడర్ మ్యాన్ కు ఆ అరుదైన రికార్డు నమోదు అయ్య అవకాశం కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వంద కోట్లకు మించి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ ను కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా ఇండియాలో అయిదు లాంగ్వేజ్ ల్లో విడుదల చేయబోతున్నారు.
ప్రతి లాంగ్వేజ్ లో కూడా సినిమా విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉంది. రెండవ రోజు పుష్ప భారీగా విడుదల చేయబోతున్నారు కనుక స్పైడర్ మ్యాన్ ను రెండవ రోజే సగం థియేటర్ల వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయినా కూడా వీకెండ్స్ లో భారీ ఎత్తున స్పైడర్ మ్యాన్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. కనుక ఇండియన్ బాక్సాఫీస్ చాలా రోజుల తర్వాత షేక్ అయ్యేలా స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్ ఉంటాయని విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు.