నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన 'జానకి రాముడు' సినిమాతో రైటర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ 1999లో వచ్చిన 'సమరసింహారెడ్డి'తో స్టార్ రైటర్ గా మారిపోయారు. ఈ మూవీ అప్పటి వరకు వున్న రికార్డుల్ని తిరగరాయడమే కాకుండా బాలయ్యకు సరికొత్త స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. రాజమౌళితో చేసిన సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర సినిమాలు విజయేంద్ర ప్రసాద్ ని రైటర్ గా మరో స్థాయికి తీసుకెళ్లాయి.
'బాహుబలి'తో విజయేంద్ర ప్రసాద్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఇప్పడు 'RRR' తో ఆస్కార్ గడపదాకా చేరి సంచలనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా బాహుబలి, 'RRR' వంటి పాన్ ఇండియా నిమాలతో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం 'RRR' సీక్వెల్ స్టోరీతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కించనున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీకి కథలు రాస్తున్నారు.
'RRR' వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో త్వరలో రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఇండియానా జోన్స్' అంటే తనకు ఇష్టమని, అలాంటి కథతో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం అలాంటి కథనే మహేష్ కోసం రెడీ చేస్తున్నామని, దీని కోసం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారని ఇటీవల దర్శకుడు రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పలువురిని షాక్ కు గురి చేస్తున్నాయి. గోవా పనాజీలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ తాను కథలు రాయనని, కొట్టేస్తానని వెల్లడించి షాకిచ్చారు. కథలు తాను రాయనని, కొట్టేస్తానని, మన చుట్టూ వుండే కథల నుంచి వాటికి తనదైన మ్యాజిక్ ని జోడించి కతలు చేస్తుంటానన్నారు.
మహాభారతం, రామాయణ, రియల్ లైఫ్ నుంచి కథలని తీసుకుంటానన్నారు. అంతే కాకుండా రచయిత అనే వాడు ఒక అబద్ధాన్ని బలమైన నిజంగా నమ్మించాలని, అలా చేసినప్పుడే సక్సెస్ వస్తుందన్నారు.
ఓ వ్యక్తి అబద్ధాన్ని ఎంత అందంగా, ఎంత ఎఫెక్టీవ్ గా చెప్పి నమ్మించ గలడో అలాంటి వ్యక్త మంచి స్టోరీ టెల్లర్ అవుతాడన్నారు. విజయేంద్ర ప్రసాద్ ఇలా ఓపెన్ గా తాను కాపీ రైటర్ ని అని, కథలు కొట్టేస్తానని చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.