రామ్‌గోపాల్ వర్మ శిష్యుల లిస్టు చాలా పెద్దదే. ఈ పాతికేళ్లలో లెక్కపెట్టలేనంతమంది శిష్యుల్ని తయారు చేసి బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ఇండస్ట్రీల్లోకి వదిలారు వర్మ. ఇక ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చి.. దర్శకుడిగా మారిన వాళ్ల లిస్టు తీస్తే ఇక్కడీ పేజీ సరిపోదు. వర్మ దగ్గర చాలా ఏళ్లు పని చేసి దర్శకుడిగా మారిన వాళ్లలో యోగేష్ ఒకడు. ముందుగా 'జైత్రయాత్ర' ఫేమ్ ఉప్పలపాటి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి.. ఆ తర్వాత వర్మ దగ్గర దాదాపు ఏడేళ్లు పని చేశాడీ యువ దర్శకుడు. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల 'ఒకరాజు ఒకరాణి'తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత 'చింతకాయల రవి' సినిమా చేసిన యోగేష్.. ఇప్పుడు 'జాదూగాడు'తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.
వర్మ దగ్గర అన్నేళ్లు పని చేసినా ఆయన తనకేమీ నేర్పించలేదని అంటున్నాడు యోగేష్. ''వర్మ ఇలా చెయ్ అలా చెయ్ అని నాకు ఏమీ చెప్పలేదు. ఏమీ నేర్పించలేదు. నిజానికి ఆయన ఎవరికీ ఏమీ చెప్పడు, నేర్పించడు. కానీ వర్మ దగ్గర పనిచేసిన వాళ్ల మీద ఆయన ప్రభావం మాత్రం విపరీతంగా ఉంటుంది. నా మీద కూడా వర్మ ప్రభావం చాలా ఉంది. అది జీవితాంతం అలాగే ఉంటుంది'' అని చెప్పాడు యోగేష్. 'జాదూగాడు' నిజ జీవిత అనుభవాలతో తయారు చేసిన కథ ఇదని.. యాక్షన్, ఎంటర్టైన్‌మెంట్ రెండూ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని యోగేష్ చెప్పాడు. నాగశౌర్యను మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోందని.. ఐతే ఏ బ్యాగేజ్ లేకుండా ఈ సినిమా చేసిన నాగశౌర్య హీరో పాత్రను అద్భుతంగా పోషించాడని యోగేష్ చెప్పాడు. 'జాదూగాడు' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.