రచయితగా కెరీర్ ప్రారంభించిన అనీల్ రావిపూడి పటాస్ చిత్రంతో దర్శకుడిగా మారిన విషయం తెల్సిందే. 'పటాస్' చిత్రంకు అవకాశం వచ్చిన సమయంలో అనీల్ రావిపూడి మహేష్ బాబు నటించిన 'ఆగడు' చిత్రంకు రచయితగా వర్క్ చేస్తున్నాడట. ఆగడు చిత్రం మొదటి పార్ట్ పూర్తి అయిన సమయంలో పటాస్ చిత్రంకు ఆఫర్ వచ్చిందని, దాంతో ఆగడు సెకండ్ హాఫ్ కు అనీల్ రావిపూడి వర్క్ చేయలేక పోయాడట. సెకండ్ హాఫ్ లో ఫుల్ లెంగ్త్ కామెడీతో స్క్రీన్ ప్లే నడపాలని శ్రీనువైట్ల భావించాడు.
అనీల్ రావిపూడి కూడా 'ఆగడు' చిత్రం సెకండ్ హాఫ్ ను తన పటాస్ చిత్రం తరహాలో అనుకున్నాడట. కాని ఈలోపు పటాస్ లో ఛాన్స్ రావడంతో తన ఐడియాస్ మొత్తం కూడా ఆ చిత్రానికి ఇంప్లిమెంట్ చేశాడట. శ్రీనువైట్ల తన సొంత ఐడియాస్ తో ఆగడు చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆగడు చిత్ర ఫలితం ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్ హాఫ్ కు కూడా అనీల్ రావిపూడి వర్క్ చేసి ఉంటే 'ఆగడు' చిత్రం ఫలితం కాస్త అయినా తేడాగా ఉండేదేమో.
అనీల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నాడు. ఈయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఎఫ్ 2 మంచి వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఈయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి 'ఎఫ్ 3' పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.
Full View