లైక్.. షేర్.. సబ్స్క్రైబ్ ఈ పదాలను ఈ మద్య కాలంలో తెగ వింటున్నాం. యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూస్తే చివర్లో లేదా మొదట్లో లేదా మధ్యలో ఎక్కడో ఒక చోట ఈ పదాలు కనిపించడం లేదా వినిపించడం జరుగుతూ ఉంటాయి. యూత్ ఆడియన్స్ కు ప్రస్తుతం ఈ పదాలు చాలా కనెక్ట్ అయ్యాయి. అలాంటి ఈ పదాలను సినిమా టైటిల్ గా సంతోష్ శోభన్ ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దివంగత ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడిగా తెరంగేట్రం చేసిన సంతోష్ శోభన్ కెరీర్ ఆరంభం నుండి విభిన్న చిత్రాలను చేసుకుంటూ కెరీర్ లో నిలదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ తో పాటు పలువురు శోభన్ తో ఉన్న సాన్నిహిత్యంతో సంతోష్ సినిమాలను ప్రమోట్ చేయడంతో ఇండస్ట్రీలో కాకుండా ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సంతోష్ శోభన్ దక్కించుకున్నాడు.
ప్రస్తుతం ఈయన వరుసగా చిన్న సినిమాలు.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాకు లైక్ షేర్ సబ్ స్క్రైబ్ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ ఒక యంగ్ యూట్యూబర్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈమద్య కాలంలో యూత్ లో యూట్యూబర్స్ కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫాలోయింగ్ తో వారు చేసే హడావుడి ఎలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం. హీరోల స్థాయిలో వారు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అందుకే సంతోష్ శోభన్ ఒక యూట్యూబర్ పాత్రలో కనిపించబోతున్నాడు. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా రూపొందుతుందట.
యూట్యూబ్ ను కెరీర్ గా ఎంచుకున్న యువకుడు జీవితంలో సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు మరియు పడ్డ కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారట. యూట్యూబర్ అంటే అంత సులభంగా సెలబ్రెటీ అవ్వడం కుదరదు.
చాలా కష్టపడాల్సి ఉంటుంది. లైక్స్ సబ్ స్క్రైబ్స్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సినిమాలో ఫేక్ థంబ్ లైన్స్ పెట్టే వారికి కౌంటర్ అన్నట్లుగా కూడా ఉంటుందట. మొత్తానికి యూట్యూబర్ కష్టాలను చాలా ఫన్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారట. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.