అఖండ సెంటిమెంట్‌ కోసం 'పుష్ప' తో ఫైట్‌!

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.

Update: 2024-08-28 05:40 GMT

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత బాలయ్య నుంచి వరుసగా మూడు విజయాలు దక్కడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ఇదే జోరును బాలయ్య కొనసాగించాలంటూ వారు కోరుకుంటున్నారు. బాలయ్య కూడా అదే ఉద్దేశ్యంతో కమర్షియల్‌ హిట్‌ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం వీరి కాంబో సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పీడ్‌ గా జరుగుతోంది.

ఆ మధ్య వీరి కాంబో మూవీ షూటింగ్‌ పూర్తి అయ్యి దసరాకు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఏపీ లో ఎన్నికల కారణంగా బాలయ్య అక్కడ బిజీ అయ్యాడు. దాంతో షూటింగ్‌ కు హాజరు అవ్వలేదు. అందుకే సినిమా ఆలస్యం అయ్యి దసరాకు వచ్చే పరిస్థితి లేదు. దసరా బరి నుంచి తప్పుకున్న బాలయ్య - బాబీ మూవీ ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి విశ్వంభరతో పాటు వెంకటేష్‌, నాగార్జున, రవితేజ సినిమాలు కూడా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో బాలయ్య సినిమా ఆ సమయంలో విడుదల అవసరమా అన్నట్టు కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య - బాబీ కాంబో మూవీని సంక్రాంతికి కాకుండా ముందే విడుదల చేయాలని భావిస్తున్నారట. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడం ద్వారా సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బాలయ్య సూపర్ హిట్‌ మూవీ అఖండ ను డిసెంబర్ 2 న విడుదల చేయడం జరిగింది. కనుక అదే తేదీన బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా విడుదల చేస్తే బాగుంటుంది అంటున్నారు. అందుకు బాలయ్య కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు సినిమా టైటిల్‌ ను ప్రకటించలేదు, అంతే కాకుండా సినిమా నుంచి అధికారికంగా పోస్టర్ ను కూడా విడుదల చేయలేదు. గ్లిమ్స్ తో పాటు టీజర్ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ లో షూటింగ్‌ షూటింగ్‌ ను జెట్‌ స్పీట్‌ తో కొనసాగించాలని దర్శకుడు బాబీ భావిస్తున్నాడు. అందుకు బాలయ్య నుంచి కూడా సహకారం అందే అవకాశాలు ఉన్నాయి. అఖండ సెంటిమెంట్‌ తో ఈ సినిమాను విడుదల చేయాలి అనుకుంటే అల్లు అర్జున్‌ పుష్ప 2 తో పోటీ పడాల్సి వస్తుంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పుష్ప తో బాలయ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలంటే డిసెంబర్ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News