బాలయ్య, ఆది ఫైట్ సీన్ వేరే లెవెల్

అదే సమయంలో బాలయ్య, బోయపాటి కాంబోలో నాలుగో సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు.

Update: 2025-02-22 06:30 GMT

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ-2 తాండవం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అంతా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బాలయ్య, బోయపాటి కాంబోలో నాలుగో సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్ వీడియో.. వేరే లెవెల్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సింపుల్ గా చెప్పాలంటే.. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. శరవేగంగా మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అప్పుడప్పుడు వస్తున్న పలు రూమర్స్, అప్డేట్స్ మూవీ లవర్స్ కు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న రోల్ లో నటిస్తున్నారని రూమర్ రాగా.. యంగ్ హీరో ఆది పినిశెట్టిని విలన్ గా కన్ఫర్మ్ అయినట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయంపై ఆయన ఓ మూవీ ఈవెంట్ లో స్పందించారు. సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. దాంతోపాటు షూటింగ్ కోసం అప్డేట్ ఇచ్చారు.

"ఇప్పుడు అఖండ-2 కోసం మాట్లాడటం చాలా ఎర్లీ అవుతుంది. అది చాలా నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఫుల్లు పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది. అందులో భాగం కావడం చాలా హ్యాపీ. ప్రస్తుత షెడ్యూల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. బాలయ్యతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది" అని తెలిపారు.

"ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బుల్లోడుతో డాడీతో సెట్స్ కు వెళ్లినప్పుడు ఆయనకు కలిశాను.. ఇప్పుడు ఆయనతో వర్క్ చేస్తున్నాను.. ఫన్ అండ్ లవింగ్.. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా" అని చెప్పారు ఆది పినిశెట్టి. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఫస్ట్ షెడ్యూల్ లో బాలయ్య, ఆది పినిశెట్టిపై ఇంటర్వెల్ ఫైట్ షూట్ చేశారని తెలుస్తోంది. ఫేమస్ ఫైట్ మాస్టర్స్.. రామ్- లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఆ ఫైట్ చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మూవీకి హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మూవీ కోసం వెయిటింగ్ అని చెబుతున్నారు.

ఇక మూవీ విషయానికొస్తే.. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. దసరా సందర్భంగా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News