అంత పెద్ద నటితో త‌స్మాత్ జాగ్ర‌త్ర‌

ఇటీవ‌లే ఆలియా న‌టించిన జిగ్రా అత్యంత భారీగా విడుద‌లైంది.

Update: 2024-10-20 03:30 GMT

బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన ఆలియా భ‌ట్, ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలోను న‌టించింది. ఆలియా అగ్ర హీరోల‌తో న‌టిస్తూనే, నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోను న‌టిస్తోంది. రాజీ, గంగూభాయి క‌థియావాడీ, ఏక్ విల‌న్ లాంటి సినిమాలు ఈ త‌ర‌హానే. అవి ఆలియాకు మంచి పేరును తెచ్చాయి.

ఇటీవ‌లే ఆలియా న‌టించిన జిగ్రా అత్యంత భారీగా విడుద‌లైంది. వాస‌న్ బాలా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం రూ.22.45 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ హక్కులను విక్రయించడం ద్వారా నిర్మాణ ఖర్చులను తిరిగి పొందగలిగిందని తెలుస్తోంది.

అయితే ఆలియా లాంటి పెద్ద స్టార్ న‌టించిన సినిమా 100 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేయాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫెయిలైంది. అయితే ఈ ప‌రాజ‌యానికి బాధ్య‌త వ‌హిస్తూ దర్శకుడు వాసన్ బాలా ముందుకు వచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ... నిర్మాత‌ల నుంచి ఎలాంటి స‌హ‌కారం అందక‌పోయినా కానీ, తాను అపరాధ భావంతో ఉన్నానని సినిమా ప‌రాజ‌యానికి తాను బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని చెప్పాడు. ఈ త‌ర‌హా ప్రధాన స్రవంతి ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించేటప్పుడు అటువంటి ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ వాసన్ బాలా అభిప్రాయాన్ని, నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాల్సిన అవసరాన్ని మరింత నొక్కి చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న ఆలియా భట్ వంటి అగ్ర క‌థానాయిక‌తో కలిసి పనిచేసేటప్పుడు ఎదుర్కోవాల్సిన‌ అదనపు పరిశీలన విష‌యంలోను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా వాస‌న్ బాలా అంగీకరించాడు. జిగ్రా నుండి నేర్చుకున్న పాఠాలు ఈసారి తనకు ప్రయోజనం చేకూర్చగలవని ఆశిస్తున్నానని, భవిష్యత్ అవకాశాలపై తాను ఆశాజనకంగా ఉన్నానని వాస‌న్ బాలా చెప్పాడు.

Tags:    

Similar News