100 రోజుల నేస్తానికి సిద్ధమైన ప్రేక్షకులు..!

దీని కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. 100 రోజులు మంచి టైం పాస్ అనిపించేలా 100 రోజుల నేస్తానికి సిద్ధం అనేలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది

Update: 2024-09-01 03:53 GMT

బిగ్ బాస్ సీజన్ 8 రేపటి నుంచి మొదలవుతుంది. దీని కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. 100 రోజులు మంచి టైం పాస్ అనిపించేలా 100 రోజుల నేస్తానికి సిద్ధం అనేలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. సీజన్ 7 ఉల్టా పుల్టా సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 8 ని మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరంభం నుంచి అదరగొట్టబోతున్నారని తెలుస్తుంది. సీజన్ 8 ప్రారంభ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ముందు హౌస్ లోకి వెళ్లి హౌస్ సెట్ ఏరియాల గురించి డీటైల్డ్ గా వివరిస్తారు. ఆ తర్వాత మళ్లీ స్టేజ్ మీదకు వచ్చి ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి హౌస్ లోకి పంపిస్తారు.

ఎప్పటిలానే ఈ సీజన్ లో కూడా క్రేజీ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ మొదలవుతుందని తెలిసి బుల్లితెర ప్రేక్షకులు కూడా తమని తాము సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కు బిగ్ బాస్ అనేది ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. మండే టు ఫ్రైడే హౌస్ మెట్స్ మధ్య జరిగే టాస్కులు, గొడవలు చూసి ఎంటర్టైన్ అవుతారు. ఇక వీకెండ్ లో నాగార్జున వచ్చి వారి ఆట తీరు గురించి చెబుతుంటే డబుల్ ఎంజాయ్ చేస్తారు.

బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి ఆట మొదటి రోజు నుంచే మొదలు పెడుతున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ ఆడియన్స్ కు ఇంకాస్త ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ అందించేలా డిఫరెంట్ టాస్కులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆడియన్స్ కూడా 100 రోజుల పాటు సాగే ఈ సీజన్ కు తమని తాము రెడీ చేసుకుంటున్నారు. ఎన్ని పనులున్నా నైట్ 9:30 గంటలకు బిగ్ బాస్ చూసేలా టైం సెట్ చేసుకుంటారు. 100 రోజుల నేస్తానికి ప్రేక్షకులు అంతా సిద్ధంగా ఉన్నారు.

ఇక ఎంటర్టైన్ చేయాల్సిన వంతు హౌస్ మెట్స్ మీద ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఓపెనింగ్ ఎపిసోడ్ కి కూడా కొంతమంది గెస్ట్ లను పిలుస్తున్నట్టు టాక్. ఆరంభం ఎపిసోడ్ లో 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ గా మరో 4 లేదా 5 హౌస్ మెట్స్ కూడా హౌజ్ లోకి వెళ్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News