వీర‌మ‌ల్లుపై ఔరంగ‌జేబు కత్తి దూసేదిలా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా పీరియాడిక్ చిత్రం `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` భారీ అంచ‌నాల మ‌ధ్య‌ తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-27 05:47 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా పీరియాడిక్ చిత్రం `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` భారీ అంచ‌నాల మ‌ధ్య‌ తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీర‌మ‌ల్లు లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ లో ప‌వ‌న్ వారియ‌ర్ పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ఆహార్యం, క‌త్తి దూసే స‌న్నివేశాలు ఆద్యంతం హైలైట్ అయ్యాయి. దో పీడికి గుర‌వుతోన్న పేద‌వాడి కోసం యోధుడి ఎలాంటి తిరిగుబాటుకు పిలుపునిచ్చాడు? అన్న‌ది ఆద్యంతం ఆక‌ట్టుకుంది.


దొంగ‌ల‌పై దొర ఎలా తిర‌గ‌బ‌డ్డాడు? అన్న‌ది టీజ‌ర్ లో చెప్పేసారు. ఇందులో మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో బాబి డియోల్ న‌టిస్తున్నట్లు టీజ‌ర్లో రివీల్ చేసారు. అయితే ఆ పాత్ర‌ను టీజ‌ర్ లో హైలైట్ చేయ‌లేదు. దీంతో ఆ పాత్ర గెట‌ప్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది. తాజాగా బాబిడియోల్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క రించుకుని నేడు అత‌డి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో బాబి డియోల్ ఓదిగిపోయాడు.

ఇందులో అత‌డు ఔరంగ‌జేబు రోల్ పోషిస్తున్నాడు. అత‌డి ఆహార్యంలో ఒదిగిపోయాడు. ఆహార్యంలోనే రాజ‌సం ఉట్టిప‌డుతుంది. జౌరంగ‌జేబు గెట‌ప్, దుస్తుల్లో క‌త్తి దూస్తోన్న వైనం...చుట్టూ త‌న సామ్రాజ్యంతో దాడికి స‌న్న‌ద మ‌వుతోన్న వైనం హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. `యానిమ‌ల్` త‌ర్వాత బాబి డియోల్ కి ప‌డిన మ‌రో మంచి పాత్ర ఇది. మొఘ‌ల్ సామ్రాజ్యంలో ఔరంగ‌జేబు పాత్ర ఎంతో కీల‌కమైన‌ది.

మ‌రి ఈ పాత్ర‌ను సినిమాలో ఎంత వ‌ర‌కూ డ్రెమ‌టైజ్ చేసారో చూడాలి. అలాగే సినిమా రిలీజ్ తేదీని పోస్ట‌ర్ లో చిన్న‌గా ఓ మూల‌న హైలైట్ చేసారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. మార్చి 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ షూటింగ్ డిలే కార‌ణంగా వాయిదా ప‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో పోస్ట‌ర్ కార్న‌ర్ లో రిలీజ్ తేదీని వేయ‌డం ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News