విద్యుత్ దీపాలకన్నా అందంగా మెరిసిసోతున్న జోడీ!
ఇదే ఏడాది జోడీ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భార్యభర్తలుగా నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్న జోడీ ఇది.
2023 దీపావళి స్పెషల్ జోడీలు ఎవరంటే? ప్రముఖంగా ఈ రెండు జోడీల్ని చెప్పుకోవాలి ఏమో! మొదటగా సిద్దార్ద్ మల్హోత్రా- కియారా అద్వాణీ ఒకరైతే...రణబీర్ కపూర్-అలియాభట్ జంటలు గురించి మాట్లాడు కోవాలి. ఈ రెండు జోడీలు సంథింగ్ స్పెషల్ గా ఈ దివాలీకి మెరిసారు. ట్రెడీషనల్ దుస్తుల్లో భార్యభర్తలు అందంగా ముస్తాబై దీపావళి అంతా మాదే అనిపించారు. మరి ఈ రెండు జోడీల్లో బెస్ట్ ఎవరంటే? కచ్చితంగా కియారా-సిద్దార్ధ్ గురించే మాట్లాడుకోవాలి.
ఇదే ఏడాది జోడీ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భార్యభర్తలుగా నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్న జోడీ ఇది. ఏ పండగొచ్చినా ఇన్ స్టాలో సంథింగ్ స్పెషల్ గా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. దీపావళిని కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈవెంట్ నుంచి మరో ఫోటో కూడా లీకైంది. అందులో సిద్దార్ధ్ తెలుపు రంగు కుర్తాలో కనిపిస్తున్నాడు.
భర్తకి మ్యాచింగ్ గా కియారా కూడా అదే రంగు ఔట్ ఫిట్ ధరించింది. ఇల్లంతటిని విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. ఇంటి టాప్ ని సైతం ప్రత్యేకంగా అలకరించారు. పిట్టగోడపై బంతిపూల అలంకరణ...అక్కడక్కడా ప్రమీదలతో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ మధ్యలో ఈ జోడీ జంటగా కెమెరాకి ఫోజులిచ్చారు. భార్యభర్తలిద్దరు సాయంసంధ్యా వేళ అలా ముంబై దీవాలీని వీక్షించడం కోసం టెర్రస్ మీదకి వచ్చినప్పుడు చిక్కిన ఫోటో ఇది.
జంట విద్యుత్ దీపాలకన్నా అందంగా మెరిసిపోతున్నారు. ప్రస్తుతం ఈఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. కళ్లన్నీ ఆ జంటపైనే ప్రశరిస్తున్నాయి. ట్రెడీషనల్ దుస్తుల్లో ఎంత అందంగా ఉన్నారంటూ అభిమానులంతా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ జంట కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వృత్తి పరంగా ఎవరు సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.