నాగ చైతన్య మిథికల్ థ్రిల్లర్.. ఇంట్రెస్టింగ్ గా 'NC 24' కాన్సెప్ట్ పోస్టర్!

కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందని ప్రకటించారు.

Update: 2024-11-23 08:00 GMT

నేడు (నవంబర్ 23) యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు చైతూ ఓ గుడ్‌ న్యూస్‌ అందించారు. ప్రస్తుతం 'తండేల్' చిత్రంలో నటిస్తున్న చై.. 'NC 24' అనే వర్కింగ్ టైటిల్ తో తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. బర్త్ డే స్పెషల్ గా ఆసక్తికరమైన కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు. కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందని ప్రకటించారు. ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు.


'విరూపాక్ష' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ భారీ సినిమా చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే చిత్రాన్ని మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాన్సెప్ట్ పోస్టర్‌లో ఒక విచిత్రమైన కన్ను లోపల, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇక్కడ చైతన్య ఫేస్ కనిపించినప్పటికీ, ఇది ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

NC24 గురించి చైతూ ట్వీట్ చేస్తూ.. ఇది పౌరాణిక థ్రిల్స్ అందిస్తుంది. దర్శకుడి అమేజింగ్ విజన్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని పేర్కొన్నారు. ''నా రాబోయే ప్రాజెక్ట్ కోసం నాగ చైతన్యతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. అద్వితీయమైన కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు నా అద్భుతమైన 'విరూపాక్ష' బృందంతో కలిసి మళ్లీ పని చేయడం ఫెంటాస్టిక్ గా అనిపిస్తుంది. నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం'' అని కార్తీక్ దండు పోస్ట్ పెట్టారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ((SVCC), సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి NC24 సినిమాని నిర్మిస్తున్నారు. 'విరూపాక్ష' వంటి బ్లాక్‌ బస్టర్‌ మిస్టికల్‌ థ్రిల్లర్‌ తర్వాత ఈ రెండు సంస్థలు.. మిథికల్ థ్రిల్లర్ కోసం చేతులు కలపడం అందరి దృష్టిని ఆర్షిస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మూవీలో అధిక భాగం సీజీ వర్క్ ఉంటుందని, ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది.

కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు. కాంతారా, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించనున్నారు. విరూపాక్షకి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. శ్యామ్‌ దత్‌ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌కు బాధ్యతలు స్వీకరించనున్నారు. డిసెంబరులో 'NC 24' మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటీనటులు, ఇతర వివరాలు ప్రకటించనున్నారు.

Tags:    

Similar News