వారంతా నాశనమైపోతారంటూ సంచలన వ్యాఖ్యలు!
అయితే ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ తో తన అనుబంధాన్ని పంచుకున్నాడు.
'చలాకీ' చంటి పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు దక్కించుకున్నాడు. జబర్దస్త్ కమెడియన్ గా ఫేమస్ అయ్యాడు. కొన్ని టీవీషోలకు యాంకరింగ్ చేసాడు. నటుడిగానూ కొన్ని సినిమాలు చేసాడు. అయితే ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ తో తన అనుబంధాన్ని పంచుకున్నాడు. అలాగే కొంత మందిపై తన ఆవేదన సైతం బయట పెట్టాడు.
'ఆ మధ్య నేను హాస్పిటల్ పాలైనప్పుడు ఒకరిద్దరు తప్పా, ఎవరూ కూడా నన్ను పలకరించలేదు. అంతకు ముందు వరకూ నాతో ఉన్నవారు ఆ సమయంలో కనిపించలేదు. నన్ను చూసిన వాళ్లంతా బాగా సంపాది స్తున్నాడని అనుకుంటారు. కానీ అలా కనిపించకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు .ఎవరూ దేనికీ పిలవరు. అందువలన కష్టమైనా , నష్టమైనా మెయింటైన్ చేయాలి. అలా చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి.
ఇక్కడ ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే 'బాగున్నావా' అని అడుగుతారు. బాగోలేకపోతే కనిపించకుండా పోతారు. ఇది కలియుగం. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి లేదు. ఎవరిపై ఆశలు పెట్టుకోకూడదు. నాకు ఇగో ఎక్కువనీ .. షూటింగుకు వస్తే నేను చాలా అడుగుతానని కొంతమంది ప్రచారం చేశారు. కొంతమంది నాకు సంబంధంలేని విషయాల్లో నన్ను ఇరికించారు. నాకు రావలసిన అవకాశాలు రాకుండా చేసారు.
అలాంటి వాళ్లంతా సర్వనాశనమై పోతారు. వాళ్లందరికీ ఇదే నా శాపం. ప్రత్యక్షంగా గానీ .. పరోక్షంగా గాని నాకు చెడు చేయడానికి ప్రయత్నించిన వాళ్లంతా నాశనమైపోతారు. అలా జరగాలని దేవుడిని రోజుకి వందసార్లు కోరుకుంటున్నా. ఇండస్ట్రీకి డబ్బులుంటేనే రావాలి. లేకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. డబ్బు లేకపోతే మనిషి జీవితం వృద్ధా' అని అన్నారు.