క్లింకార కి చరణ్ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా..!

తనకు అత్యంత ఇష్టమైన బాద్‌ షా గుర్రం ను మగధీర లో చూపించడం ద్వారా ఆ మధ్య మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది.

Update: 2024-08-23 12:05 GMT

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కి జంతువులు అంటే చాలా ఇష్టం అనే విషయం తెల్సిందే. ఆ ఇష్టంతోనే తన ఫామ్‌ లో ఎన్నో గుర్రాలను పెంచుతూ ఉన్నాడు. దాదాపు 20 ఏళ్లుగా రామ్‌ చరణ్ గుర్రాల పై తన అభిమానం ను కనబర్చుతూ వస్తున్నాడు. మగధీర సినిమాలో చరణ్ తన సొంత గుర్రం తో కనిపించిన విషయం తెల్సిందే. తనకు అత్యంత ఇష్టమైన బాద్‌ షా గుర్రం ను మగధీర లో చూపించడం ద్వారా ఆ మధ్య మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఏ టాలీవుడ్ హీరో వద్ద లేనన్ని గుర్రాలు రామ్‌ చరణ్ వద్ద ఉన్నాయని సమాచారం.

తాజాగా రామ్‌ చరణ్ తన కూతురు క్లీంకార కి కూడా గుర్రం పిల్లను బహుమానంగా ఇచ్చాడట. అది కూడా మగధీర సినిమాలో కనిపించిన బాద్‌ షా గుర్రంకు జన్మించిన గుర్రం పిల్లను రామ్‌ చరణ్‌ తన కూతురుకు బహుమానంగా ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. క్లింకార కు అప్పుడే జంతువులు అంటే చాలా ఇష్టం ఏర్పడిందని, తనకు ఇచ్చిన గుర్రం పిల్లతో ఆడటం తో పాటు, పెట్స్ తో కూడా ఇష్టంగా ఆడుతూ ఉంటుందని చరణ్‌ చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్, ఉపాసన, క్లీంకార ఇంకా మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు పారిస్‌ ట్రిప్ కు వెళ్లారు. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ ఈఫిల్ టవర్‌ వద్ద ఫోటో దిగి సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. తాత నానమ్మ తో క్లీంకార మొదటి విదేశీ ట్రిప్‌ ను బాగా ఎంజాయ్ చేసింది అంటూ రామ్ చరణ్‌ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్లీంకార ఫోటోలను ఇప్పటి వరకు రివీల్‌ చేయక పోవడంతో మెగా ఫ్యాన్స్‌ తో పాటు అంతా కూడా పాప ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను ఇదే ఏడాది చివరి వరకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా 2025 సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది.

Tags:    

Similar News