క్లాష్ బిగ్ మిస్టేక్ అంటోన్న ప్ర‌శాంత్ నీల్!

ఇలా అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ క్లాష్ వ‌స్తే అది న‌ష్టాల‌కే దారి తీస్తుంది త‌ప్ప లాభాలకు కాదు! అన్న‌ది అంద‌రికీ తెలిసిందే.

Update: 2023-12-31 19:39 GMT

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ న‌టించిన `డంకీ`...పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `స‌లార్` భారీ అంచ‌నాల మ‌ధ్య ఒక్క‌రోజు గ్యాప్ లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 21న `డంకీ` రిలీజ్ అయితే...డిజెంబ‌ర్ 22న `స‌లార్` రిలీజ్ అయింది. దీంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వార్ కి దిగిన‌ట్లు అయింది. ఇలా అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ క్లాష్ వ‌స్తే అది న‌ష్టాల‌కే దారి తీస్తుంది త‌ప్ప లాభాలకు కాదు! అన్న‌ది అంద‌రికీ తెలిసిందే.

అయితే ఈ రెండు సినిమాల‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌? ఏంటంటే? ఒక‌టి హిందీ సినిమా కావ‌డం..మరొక‌టి తెలుగు సినిమా కావ‌డంతో! రిలీజ్ కి రావాల్సి వ‌చ్చింది. తెలుగులో అయితే ఈ క్లాష్ రాకుండా జాగ్ర‌త్త ప‌డతారు. ఒక‌వేళ వ‌చ్చినా వ‌సూళ్ల‌పై ఆ ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌పడ‌తారు. కానీ స‌లార్....డంకీ విష‌యంలో అలా అలెర్ట్ అవ్వ‌డానికి ఛాన్సు లేకుండా పోయింది. స‌లార్ పై నార్త్ మార్కెట్ లో కొంత ప్ర‌భావం అయితే డంకీ కార‌ణంగా ప‌డింది.

వ‌సూళ్లు వీక్ గా కనిపించాయి అందుకు కార‌ణం షారుక్ ఖాన్ ఇమేజ్ అని చెప్పొచ్చు. అత‌ని గ‌త రెండు సినిమాలు `ప‌ఠాన్`...`జవాన్` వ‌రుస‌గా భారీ విజ‌యం సాధించాయి. రెండు రెండు వేల కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించాయి. డంకీ కి నెగిటివ్ టాక్ వ‌చ్చినా ఈజీగా 350 కోట్లు రాబ‌ట్టింది. ఇక్క‌డ స‌లార్ పై ప్ర‌భావం ప‌డింద‌నొచ్చు. డంకీ రిలీజ్ లేక‌పోయి ఉంటే స‌లార్ వ‌సూళ్లు ఇంకా భారీగా క‌నిపించేవి. అలాగే స‌లార్ రిలీజ్ లేక‌పోయినా డంకీ వ‌సూళ్లు నార్త్ లో మ‌రింత మెరుగ్గా ఉండేవి.

ఆ ర‌కంగా క్లాష్ అనేది ఎంత ప్ర‌మాద‌క‌రం అన్న‌ది అర్ద‌మైంది. ఇదే విష‌యంపై స‌లార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాం త్ నీల్ కూడా అంగీక‌రించాడు. క్లాష్ అవ్వ‌డం అన్న‌ది ఏ సినిమాకి మంచిది కాద‌ని...రెండు వేర్వేరు భాష‌ల చిత్రాలు కావ‌డంతో ఆ ర‌క‌మైన ప‌రిస్థితి ఏదురైన‌ట్లు చెప్పుకొచ్చారు. కానీ ఈ క్లాష్ గురించి బాలీవుడ్ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు.

Tags:    

Similar News