దేవ‌యాని స్కూల్ టీచ‌ర్ గా ప‌నిచేస్తుందా?

మ‌రి ఇంత ఫేమ‌స్ అయిన న‌టి ఓ స్కూల్ టీచ‌ర్ గా జీవ‌నం సాగిస్తున్నారు? అంటే న‌మ్ముతారా? కానీ న‌మ్మాల్సిన నిజ‌మిది.

Update: 2023-10-04 03:15 GMT

వెట‌ర‌న్ న‌టి దేవ‌యానీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు..హిందీ..త‌మిళ‌..మ‌ల‌యాళ‌..క‌న్న‌డ చిత్రాల్లో న‌టించారు. 'సుస్వాగ‌తం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. తొలి సినిమాతోనే తెలుగు నాట ఎంతో పాపుల‌ర్ అయిన న‌టి ఆమె. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసారు. 'ఎన్టీఆర్ క‌థానాయ కుడు'..'ల‌వ్ స్టోరీ'..'జ‌న‌తా గ్యారేజ్' లాంటి చిత్రాల్లోనూ ఈ మ‌ధ్య కాలంలో న‌టించారు. అలాగే టీవీ సీరియ‌ల్స్..షోస్ కూడా చేసారు.

మ‌రి ఇంత ఫేమ‌స్ అయిన న‌టి ఓ స్కూల్ టీచ‌ర్ గా జీవ‌నం సాగిస్తున్నారు? అంటే న‌మ్ముతారా? కానీ న‌మ్మాల్సిన నిజ‌మిది. త‌మిళ‌నాడులోని అన్నాసాలై లో గ‌ల చ‌ర్చికాన్వెంట్ పాఠ‌శాల్లో ఆమె న‌ర్స‌రీ పిల్ల‌ల‌కు పాఠాలు బోధిస్తున్నారు. అందుకు గాను దేవ‌యానికి ప‌దివేలు జీతం చెల్లిస్తున్నారు. మ‌రి ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఇప్పుడిలా పాఠాలు బోధించ‌డం ఏంటి? అంటే ఆమెకు టీచ‌ర్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం.

తొలుత ఆమె ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకున్నారు. ఆ త‌ర్వాత అనివార్య కార‌ణాల‌తో సినిమాల్లోకి వ‌చ్చారు. అక్క‌డ స‌క్సెస్ అయిన త‌ర్వాత త‌మిళ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ న‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకోవ‌డం దేవ‌యానికి త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు. ఇప్ప‌టికీ అల్లుడికి-అత్తింటి కుటుంబానికి మాట‌ల్లేవ్. దేవ‌యాని మాత్ర‌మే త‌ల్లిదండ్రుల‌కు ట‌చ్ లో ఉంటుంది.

వివాహం త‌ర్వాత దేవ‌యానికి అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. అలాగే ఉన్న డ‌బ్బుతో నిర్మాణంలోకి దిగి న‌ష్ట‌పోయారు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ సినిమాల్లో న‌టించి అప్పులు తీర్చారు. ఇదే స‌మ‌యంలో టీచ‌ర్ ఉద్యోగానికి కావాల్సిన అర్హ‌త‌లు సంపాదించారు. అయితే రంగుల జీవితం ఎప్పుడూ సాఫీ కాదు క‌దా. ఇప్పుడా టీచ‌ర్ ఉద్యోగ‌మే కుటుంబ పోష‌ణ‌కు ఆధార‌మైంది అన్న‌ది కొంద‌ది వాద‌న కాగా..కేవ‌లం ఆ ఉద్యోగం పై ఇష్టంతోనే చేస్తుంది త‌ప్ప‌! డ‌బ్బులు కోసం కాద‌ని మ‌రికొంత మంది అంటున్నారు. ఏది ఏమైనా తెలిసిన ప‌నిచేయ‌డంలో త‌ప్పు లేదు. ఇండ‌స్ట్రీకొచ్చి కోట్లు సంపాదించిన ఎంతో మంది చివ‌రి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందులు ప‌డిన వారు ఎంతో మంది ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News