క్రేజ్ లేని సీక్వెల్ కోసం రకుల్ సమయం వృధా
స్టార్ కాస్టింగ్, దర్శకుడు, సహాయనటల కోసమే భారీ పారితోషికాలను కేటాయించాల్సి వస్తోంది.;
ఈరోజుల్లో స్టార్ హీరోతో సినిమా తీయాలంటే 100 కోట్లు మినిమం బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. స్టార్ కాస్టింగ్, దర్శకుడు, సహాయనటల కోసమే భారీ పారితోషికాలను కేటాయించాల్సి వస్తోంది. సెట్లు, వీఎఫ్.ఎక్స్ వగైరా వగైరా ఖర్చులు చాలా ఎక్కువ. అయితే అంత ఖర్చు చేసి హిట్టు కొట్టకపోతే ఎందుకు? ఇటీవల సీక్వెల్ సినిమాలపై దృష్టి సారిస్తున్న బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ తదుపరి వరుసగా సీక్వెల్స్ పై దృష్టి సారిస్తున్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్లతో తెరకెక్కించాల్సినవి.
ఇందులో `దే దే ప్యార్ దే 2` ఒకటి. ఈ సినిమా మొదటి భాగం ఓకే అనిపించింది. కానీ కంటెంట్ పరంగా రొటీన్. తనకంటే తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయితో మిడిలేజీ మ్యాన్ రొమాన్స్ నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ ఇది. అయితే ఇందులో అంతకుమించి చూడటానికి వెరైటీ ఏదీ ఉండదు. అందువల్ల ఇలాంటి రొటీన్ కంటెంట్ కోసం వంద కోట్ల బడ్జెట్ అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అలా కాకుండా, దృశ్యం ఫ్రాంఛైజీపై దేవగన్ దృష్టి సారిస్తే మంచిదని చాలా మంది సూచిస్తున్నారు. `దేదే ప్యార్ దే`లో జాతీయ ఉత్తమ నటి టబు కనిపించేందుకు ఆస్కారం లేదు. అయితే ఆర్. మాధవన్ (మ్యాడీ) కాస్టింగ్ లో చేరతారని టాక్ వినిపిస్తోంది. ఎన్ని మార్పులు చేసినా కానీ క్రేజ్ ఉండాలి... బజ్ చాలా ముఖ్యం. అవేవీ లేనప్పుడు వంద కోట్లు దేనికోసం ఖర్చు చేయాలి? అన్నదే ప్రశ్న. అయితే ఇవేవీ అంతగా అర్థం కాని రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే సీక్వెల్ ఆలోచనలకు ప్రచారం కల్పిస్తోంది. కానీ అంతగా హైప్ లేని చిత్రానికి సీక్వెల్ చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.