దిల్ రాజు రెండు పిట్టలు.. క్లిక్కయితే సమ్మర్ లో కాసుల వర్షమే..

ఆ సినిమా కూడా సమ్మర్ భారీలో ఒంటరిగానే రిలీజ్ అవుతోంది కాబట్టి ఏమాత్రం క్లిక్కయినా దిల్ రాజుకి మరో జాక్ పాట్ అని చెప్పవచ్చు.

Update: 2024-03-30 09:10 GMT

సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ గా వీటిని చెప్పుకోవాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ కి కూడా టిల్లు స్క్వేర్ సాలిడ్ లాభాలు తీసుకురావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

వీకెండ్ తో పాటు సెలవులు కూడా కలిసి రానున్న నేపథ్యంలో థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ సినిమా నైజాం రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఇదివరకే హారికా హాసినిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాతో దిల్ రాజు నైజాంలో దారుణంగా నష్టపోయారు. హనుమాన్ మూవీ గుంటూరు కారంపై గట్టి ప్రభావం చూపించింది.

అయితే గుంటూరు కారంతో నష్టపోవడంతో దాని అనుబంధ సంస్థ సితార వారు టిల్లు స్క్వేర్ నైజాం రైట్స్ రిజనబుల్ రేటుకు దిల్ రాజుకి ఇచ్చారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టిల్లు కథ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ఈ కారణంగా సినిమాకి నైజాంలో భారీ వసూళ్లు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

గుంటూరు కారంతో నష్టపోయిన దిల్ రాజుకి టిల్లు సాలిడ్ జాక్ పాట్ ఇచ్చాడనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. పోటీగా మరే పెద్ద సినిమాలు కూడా లేవు. కేవలం ఒక వారం తరువాత ఫ్యామిలీ స్టార్ రానుంది. అది కూడా దిల్ రాజు సినిమా కాబట్టి. టిల్లు సినిమాకు ఇబ్బంది లేకుండా థియేటర్స్ ను సెట్ చేయగలరు అని చెప్పవచ్చు.

ఆ సినిమా కూడా సమ్మర్ భారీలో ఒంటరిగానే రిలీజ్ అవుతోంది కాబట్టి ఏమాత్రం క్లిక్కయినా దిల్ రాజుకి మరో జాక్ పాట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టిల్లు స్క్వేర్ యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక అన్ని వర్గాల ఆడియెన్స్ తో డిస్ట్రిబ్యూటర్ గా అలాగే నిర్మాతగా రాజుగారు సాలీడ్ లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కంప్లీట్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇప్పటి వరకు అనుపమని చూసిన ఆడియన్స్ కి టిల్లు స్క్వేర్ లో మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలాంటి వారైన ఫ్యాన్స్ గా మారిపోతారని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా రిలీజ్ కి ముందు లిల్లీ పాత్రపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. అయితే రాధిక తరహాలో లిల్లీ కూడా యూత్ కి చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని భావిస్తున్నారు. టిల్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతని పెర్ఫార్మెన్స్, వన్ లైనర్ కామెడీని ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Tags:    

Similar News