వివాదాస్పద గురువు ఓషో సహాయకురాలి జీవితకథతో
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓషో సహాయకురాలు మా ఆనంద్ షీలా తన జీవితకథతో సినిమా తీస్తే దానిలో ఆలియా భట్ మాత్రమే నటించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.;

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఓషో సహాయకురాలి నడుమ వివాదం కొనసాగిందా? అంటే అవుననే అంగీకరించాలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓషో సహాయకురాలు మా ఆనంద్ షీలా తన జీవితకథతో సినిమా తీస్తే దానిలో ఆలియా భట్ మాత్రమే నటించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎందుకు నటించకూడదు? అని ప్రశ్నిస్తే.. దానికి తన కారణం తనకు ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంక చోప్రా తనకు ఓషో శిష్యురాలు ఆనంద్ షీలా పాత్రలో నటించాలనుందని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత కానీ, అంతకుముందు కానీ తనను ప్రియాంక చోప్రా కనీస మాత్రంగా అయినా సంప్రదించలేదని, తన జీవితకథలో నటించాలనుందని అడగలేదని ఆనంద్ షీలా వ్యాఖ్యానించారు. తన పాత్రలో ప్రియాంక చోప్రా నటించగలదు.. కానీ ఆప్షన్ మాత్రం ఆలియాభట్ కే ఉందని తెలిపింది. అంతేకాదు జాతీయ ఉత్తమ నటి ఆలియా గురించి తన సోదరి తనకు స్పష్ఠంగా చెప్పిందని, ఆలియా సినిమాలు చూడక పోయినా కానీ, కొన్ని సీన్లలో తనను చూసి అభిమానించానని ఆనంద్ షీలా తెలిపారు.
ఈ సినిమాకి కపూర్ అండ్ సన్స్, గెహ్రయాన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన షకున్ బాత్రా దర్శకత్వం వహిస్తారని కూడా మా ఆనంద్ షీలా తెలిపారు. ఆయన గతంలో షీలా జీవితకథతో ఓ డాక్యు సిరీస్ ని తెరకెక్కించారు. అందుకే ఇప్పుడు ఆయన తన జీవితకథను కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాలని కోరుకుంటున్నారు షీలా. అయితే చాలా కాలం క్రితమే సినిమా తీయాలని ప్రయత్నించినా కానీ డబ్బు సమస్యల కారణంగా అది జరగలేదని షీలా తెలిపారు.