ఇళయరాజా మ్యూజిక్ విని మందుకు బానిసైన వాళ్లు ఎంతో మంది ఉన్నారని!
ఇళయరాజా సంగీతమంటే చెవులు కోసుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు
ఇళయరాజా సంగీతమంటే చెవులు కోసుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. అప్పటి నుంచి ఇప్పటి 5జీ జెనరేషన్ మ్యూజిక్ లవర్స్ వరకు అందరూ ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా చెప్తుంటారు. పలు భాషల్లో ఎన్నో మంచి క్లాసికల్, ఎవర్‌గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే.
అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పై ఓ డైరెక్టర్ చేసిన కామెంట్స్ అందరినీ తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తమిళ డైరెక్టర్ మిస్కిన్ డిటెక్టివ్, పిశాచి, సైకో లాంటి సినిమాలతో అందరికీ పరిచయస్తుడే. ఆయన రీసెంట్ గా బాటిల్ రాధ అనే తమిళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇళయరాజాపై కామెంట్స్ చేశాడు.
ఇళయరాజా మ్యూజిక్ విని మందుకు బానిసైన వాళ్లు ఎంతో మంది ఉన్నారని, ఇళయరాజా సంగీతం వల్ల ఆరోగ్యాలు చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అనడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మిస్కిన్ ఏ ఇంటెన్షన్ తో చెప్పాడో కానీ ఆయన చెప్పిన అర్థం మాత్రం పూర్తి నెగిటివ్ గా అందరికీ అర్థమైంది.
ఇళయరాజా సాంగ్స్ వినే ఆడియన్స్ బార్స్ కు వెళ్లేవాళ్ళేననే యాంగిల్ లో అర్థం కావడంతో అందరూ మిస్కిన్ పై కోప్పడుతున్నారు. దీంతో జరిగిన తప్పుకు బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన క్షమాపణ కోరారు. గతంలో మిస్కిన్, ఇళయరాజా కలిసి సైకో సినిమాకు పని చేశారు. ఈ విషయంలో విశాల్ స్పందిస్తూ మిస్కిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గొప్ప వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం మిస్కిన్ కు ఎప్పుట్నుంచో ఉన్న అలవాటేనని, ఇళయారాజాని అనేంత రేంజ్ మిస్కిన్ లేదని, క్షమాపణలు చెప్తే చేసిన తప్పు ఒప్పు కాదని విశాల్ అన్నాడు. అయినా మిస్కిన్ నోరు జారడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కొట్టుకలి మూవీ ఈవెంట్ లో కూడా ఆ సినిమా సరిగా ఆడకపోతే నగ్నంగా నిలబడతానని స్టేట్‌మెంట్ ఇచ్చి సినిమాను హైలైట్ అయ్యాడు. ఇదిలా ఉంటే విశాల్, మిస్కిన్ మధ్య డిటెక్టివ్2 తీస్తున్న టైమ్ లో విభేదాలొచ్చిన విషయం తెలిసిందే. డిటెక్టివ్2ను విశాల్ డైరెక్ట్ చేయాలనుకోవడంతో వారిద్దరి మధ్య సఖ్యత కుదరక మిస్కిన్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేశాడు.