.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి.. ఇక్కడే కాదు.. హాలీవుడ్ వాళ్లు కూడా!

మహానటి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్.. కల్కితో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్నారు.

Update: 2024-06-29 10:01 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం.. వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. నాగి టాలెంట్ కు అటు కామన్ ఆడియన్స్ తో పాటు ఇటు సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు.

మహానటి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్.. కల్కితో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగి కోసం చర్చ నడుస్తోంది. ఆయన సూపర్ టాలెంట్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి రివ్యూలో నాగి టాలెంట్ ను అందరూ తప్పకుండా ప్రస్తావిస్తున్నారు. ఇండియన్ సినిమాను అందనంత ఎత్తుకు తీసుకెళ్లారని చెబుతున్నారు.

కేవలం ఇండియాలోనే కాదు.. హాలీవుడ్ క్రిటిక్స్ కూడా కల్కి సినిమా కోసం మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ టాలెంట్ ను ప్రశంసిస్తున్నారు. సాధారణంగా అతీంద్రియ శక్తులను, సైన్స్ ను కలపడం చాలా కష్టమని, ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతుంటాయని హాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు. కానీ దర్శకుడు నాగి బాగానే హ్యాండిల్ చేశారని అంటున్నారు. ఎక్కడ సైన్స్, ఎక్కడ హిస్టరీ చూపించాలో కరెక్ట్ గా డిసైడ్ చేశారని అభిప్రాయపడుతున్నారు.

సినిమా కోసం నాగ్ అశ్విన్ చాలా స్మార్ట్ గా స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నారని కొనియాడుతున్నారు. సైన్స్ ను, పురాణాలను కలిపి వేసి గందరగోళంగా అనిపించకుండా మూవీ తీశారని చెబుతున్నారు. కంప్లీట్ వర్క్ పెర్ఫెక్ట్ గా ఉందని అంటున్నారు. అనుకున్నదానికంటే సినిమా వేరే లెవల్ లో ఉందని కొనియాడుతున్నారు. హాలీవుడ్ లో ఒకే రకమైన కథలు చేస్తూ ఉంటారని, రెండు జోనర్లను మిక్స్ చేసి సినిమాలు తీయడం లేదని అభిప్రాయపడుతున్నారు.

రెండు జోనర్లు కలిపితే చాలా ప్రెష్ గా ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా పెద్ద సినిమాలు తీసేటప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అలాంటి టైమ్ లో కూడా నాగ్ అశ్విన్ సరైన రీతిలో హ్యాండిల్ చేశారని కొనియాడుతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ తో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు జీవం పోశారని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా కల్కి మూవీ అదిరిపోయిందని అంటున్నారు.

Tags:    

Similar News