ఓటీటీలో దుమ్ము రేపుతున్న గేమ్ ఛేంజర్
ఈ మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.;

టాలీవుడ్ లో మొన్న సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. అందులో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాతో పాటూ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలున్నాయి. ఈ మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో వచ్చినప్పటికీ ఫ్లాప్ గానే నిలిచింది. దీంతో చిత్ర నిర్మాత దిల్ రాజు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది.
అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన గేమ్ ఛేంజర్ ఓటీటీలో మాత్రం తన సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 7న గేమ్ ఛేంజర్ సౌత్ భాషలన్నింటిలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాగా, హిందీ భాషలో మాత్రం మార్చి 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజైన నాటి నుంచి టాప్ టెన్ లిస్ట్ లోనే దూసుకెళ్తుంది.
ఆల్రెడీ గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ కు 250 మిలియన్ మినిట్స్ కు పైగా వ్యూస్ వచ్చినట్టు స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఎక్స్‌లో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమా ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం ను కూడా క్రాస్ చేసిందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మార్చి 1న రిలీజై ఇప్పటివరకు 400 మిలియన్ మినిట్స్ ను అందుకుంటే, గేమ్ ఛేంజర్ ఒక్క హిందీ భాషలోనే అది కూడా మార్చి 7న రిలీజై ఇప్పటికే 250 మిలియన్ మినిట్స్ నమోదు చేసుకుందంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజునే అన్న విషయం తెలిసిందే.