ప్రభాస్ కన్నా ముందే మహేష్ తో అతని ఫైట్.. !

ఇదిలాఉంటే పృధ్విరాజ్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కు సలార్ లో వరద రాజమన్నార్ పాత్ర ద్వారా దగ్గరయ్యాడు.;

Update: 2025-03-30 00:30 GMT
ప్రభాస్ కన్నా ముందే మహేష్ తో అతని ఫైట్.. !

మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. యాక్టర్ గానే కాదు డైరెక్టర్ గా కూడా పృధ్విరాజ్ తన టాలెంట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా పృధ్విరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా గురువారం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. తెలుగులో సినిమా జస్ట్ ఓకే అనిపించినా మలయాళ ఆడియన్స్ దీన్ని పెద్ద హిట్ చేశారు. ఇదిలాఉంటే పృధ్విరాజ్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కు సలార్ లో వరద రాజమన్నార్ పాత్ర ద్వారా దగ్గరయ్యాడు.

సలార్ 1 లో దేవా స్నేహితుడిగా వరద పాత్రలో మెప్పించాడు. ఐతే సలార్ 2 లో దేవర, వరద మధ్య ఫైట్ ఉండనుంది. ప్రాణ స్నేహితుల మధ్య బీకర యుద్ధం జరగబోతుంది. ఐతే ప్రభాస్ తో ఫైట్ చేసే ముందే పృధ్విరాజ్ సూపర్ స్టార్ మహేష్ తో ఫైట్స్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఐతే మహేష్ తో పృధ్విరాజ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాక ఈ విషయం కన్ ఫర్మ్ చేశారు.

ఐతే ఈమధ్య పృధ్విరాజ్ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి సినిమాకు తాను ఏడాది పాటు డిస్కషన్స్ లో పాల్గొన్నా అంటూ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో సలార్ 2 కన్నా ముందే రాజమౌళి మహేష్ సినిమా షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. సో తెర మీద ప్రభాస్ తో ఫైట్ చేయడానికి ముందే మహేష్ తో పృధ్విరాజ్ ఢీ కొట్టబోతున్నాడు. ఐతే ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని చెప్పొచ్చు.

ముఖ్యంగా పృధ్విరాజ్ విలన్ రోల్స్ ని అంత ఈజీగా ఒప్పుకోడు. రాజమౌళి సినిమా అయినా కూడా తన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందా అన్న డౌట్ ఉంటుంది. ఐతే మహేష్ సినిమాలో మెయిన్ విలన్ అనగానే ఆ ఛాన్స్ మిస్ అవ్వకూడదని పృధ్విరాజ్ లాక్ చేసుకున్నాడు. తప్పకుండా మహేష్ పృధ్విరాజ్ స్క్రీన్ ఫైట్ కచ్చితంగా ఆడియన్స్ కు మంచి ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు.

సో మహేష్ సినిమాతో పాటు సలార్ 2 కూడా రిలీజ్ అయితే క్రేజీ విలన్ గా పాన్ ఇండియా లెవెల్ లో పృధ్విరాజ్ సుకుమారన్ సూపర్ పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతాయని మాత్రం చెప్పొచ్చు.

Tags:    

Similar News