సమంతను చూసైనా మిగిలిన వాళ్లు రెస్పాండ్ అవుతారా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదం గురించి తెలంగాణలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.;

వీలైనంత వరకు ఎవరూ వివాదాలను కొని తెచ్చుకోరు. సినీ సెలబ్రిటీలు కూడా అంతే. వివాదమయ్యే విషయాలపై మాట్లాడి అనవసరంగా సమస్యలను తెచ్చుకోవడం ఎందుకని దాని గురించి పెద్దగా స్పందించరు. కానీ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం అలా కాదు. ప్రస్తుతం తెలంగాణలో అందరూ ఫైట్ చేస్తున్న అంశంపై సమంత కూడా గొంతు విప్పింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదం గురించి తెలంగాణలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ కు ఆనుకున్న ఉన్న 400 ఎకరాల భూమి తమ యూనివర్సిటీకి చెందినది స్టూడెంట్స్ అంటుంటే, దానికి యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని గవర్నమెంట్ చెప్తోంది.
ఈ విషయంలో విద్యార్థులు నిరసనలకు దిగి ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా అటవీ నిర్మూలనను చేపట్టింది. తాజాగా ఈ విషయంలో సినీ నటి సమంత సోషల్ మీడియాలో స్పందించింది. ఓ వైపు నిరసనలు కొనసాగుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలోని చెట్లను నరికేయడానికి సుమారు 400 బుల్డోజర్లను రంగంలోకి దింపారని ఆందోళన వ్యక్తం చేసింది.
అటవీ ప్రాంతాన్ని నిర్మూలించడం ద్వారా మరో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తోన్న సమంత, ఎన్నో అడవి జంతువులకు, పక్షులకు నిలయమైన అడవిని రక్షించాలని కోరింది. ఈ విషయమై స్టార్ హీరోయిన్లు పెద్దగా స్పందించనప్పటికీ సమంత స్పందించి ముందుకు రావడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమంత గట్స్ చూసి అందరూ సంతోషిస్తున్నారు. సమంతను చూసి అయినా మిగిలిన స్టార్ సెలబ్రిటీలు ఈ విషయంపై గొంతు విప్పితే బావుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్ నుంచి నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, ప్రియదర్శి, ఈషా రెబ్బా, వేణు ఉడుగులు, ప్రకాష్ రాజ్, రేణూ దేశాయ్ స్పందించి, అడవీ నిర్మూలనను జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.