గోవింద ఖాతాలో పడాల్సిన జుడ్వా.. సల్మాన్ అలా చేశాడా..?

ఐతే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తను చేయాల్సిన సినిమా సల్మాన్ ఖాన్ చేశారని చెప్పి షాక్ ఇచ్చారు.

Update: 2024-10-10 21:30 GMT

బాలీవుడ్ స్టార్ యాక్టర్ గోవింద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాక్టింగ్ టాలెంట్ తో కామెడీ టైమింగ్ తో హిందీ పరిశ్రమలో తన కంటూ స్పెషల్ క్రేజ్ వచ్చేలా చేసుకున్నాడు. ఐతే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుంటారు అలాంటి వారిలో గోవింద ఒకరు. మొదటి సినిమా హిట్ తో ఆయన తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా అవకాశాలు వచ్చాయి. దాని వల్ల 20, 21 ఏళ్లకే 70 సినిమాల దాకా చేశారు గోవింద.

ఐతే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తను చేయాల్సిన సినిమా సల్మాన్ ఖాన్ చేశారని చెప్పి షాక్ ఇచ్చారు. వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న గోవింద తన మొదటి సినిమా ఇల్జామ్ నుంచి లవ్ 86, కూలీ నెం.1, హీరో నెం.1, రాజాబాబు, ఆంఖేన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. కెరీర్ లో దాదాపు 130 సినిమాల దాకా చేసిన గోవింద సక్సెస్ శాతం కూడా ఎక్కువే అనిపించుకున్నారు. ఐతే సల్మాన్ ఖాన్ చేసిన జుడ్వా సినిమా మొదట గోవింద తో చేయాలని అనుకున్నారట. కానీ సల్మాన్ ఖాన్ స్వయంగా వచ్చి గోవింద్ భాయ్ ఎన్ని హిట్లు కొడతావ్.. నువ్వు చేస్తున్న జుడ్వా నుంచి తప్పుకో నేను ఆ సినిమా చేస్తానని అన్నారట. అందుకు దర్శక నిర్మాతలను తాను ఒప్పించానని సల్మాన్ చెప్పారట. అలా సినిమా మధ్యలో తనను బయటకు పంపించారని గోవింద చెప్పారు. ఐతే గోవింద చేయాల్సిన జుడ్వా సినిమా సల్మాన్ ఖాన్ కి మంచి సక్సెస్ తెచ్చి పెట్టింది.

ఇదిలాఉంటే గోవింద కెరీర్ లో ఎక్కువ సక్సెస్ అందుకున్న సినిమాలన్నీ కూడా డైరెక్టర్ డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో వచ్చినవే. అంతేకాదు గోవింద కథానాయిక నీలంతో ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు ఈ ఇద్దరు 14 సినిమాల్లో కలిసి నటించారు. వీరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు వీరిని రిపీట్ చేస్తూ వచ్చారు.

నటుడికి కెరీర్ లో ఎత్తు పల్లాలు కామన్ కాబట్టి 2000వ దశకంలో గోవింద హిట్ రేసులో వెనకపడ్డాడు. కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న టైం లో భాగం భాగ్ సినిమా అతనికి సక్సెస్ అందించింది. అప్పటి నుంచి మళ్లీ ఆయన ట్రాక్ ఎక్కారు. బాలీవుడ్ హంగామాలో గోవింద ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ వల్లే జుడ్వా ఛాన్స్ వదులుకున్నానని చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్ లో వేడి వేడి చర్చ నడుస్తుంది.

Tags:    

Similar News