ఒక్క సినిమా... ముగ్గురు పాన్‌ ఇండియా సూపర్‌స్టార్స్‌

సౌత్ సినీ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.;

Update: 2025-04-05 16:30 GMT
ఒక్క సినిమా... ముగ్గురు పాన్‌ ఇండియా సూపర్‌స్టార్స్‌

సౌత్ సినీ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. స్టార్‌ హీరోలు తోటి స్టార్‌ హీరోల సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌లో నటించడం కూడా మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా బాలీవుడ్‌లో రెగ్యులర్‌గా మల్టీస్టారర్‌ సినిమాలు హిందీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో రూపొందుతున్న అతి పెద్ద మల్టీస్టారర్ మూవీ 'లవ్‌ అండ్‌ వార్‌'. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్‌ సెన్షేషనల్‌ స్టార్స్‌ రణబీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఈ సినిమాలో నటించడం విశేషం.

ఈ ముగ్గురు బాలీవుడ్‌లో సూపర్‌ స్టార్స్ అనడంలో సందేహం లేదు. రణబీర్‌ కపూర్‌ 2023లో యానిమల్‌ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. ఇక ఇటీవల ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్కీ కౌశల్‌ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. ఇక ఆలియా భట్‌ తన 'గంగుబాయి కథియావాడి' సినిమాతో రూ.200 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. సోలో హీరోయిన్‌గా, హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాతో ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడం రికార్డ్‌ అనడంలో సందేహం లేదు. ముగ్గురికి ముగ్గురు అద్భుతమైన రికార్డ్‌లను తమ ఖాతాలే వేసుకున్నారు. అలాంటి ముగ్గురు కలిసి సినిమా అంటే మామూలుగా ఉండదు.

ఈ ముగ్గురికి తోడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్‌ అండ్ వార్‌' సినిమా రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను భారీ బడ్జెట్‌తో స్వీయ దర్శకత్వంలో భన్సాలీ నిర్మిస్తున్నారు. హీరోలతో పాటు ఆలియా భట్‌ సైతం భారీ పారితోషికంను అందుకుంటుంది. రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ పెళ్లి తర్వాత మరోసారి కలిసి నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఉన్నాయి. పైగా వీరిద్దరి మధ్యలో విక్కీ కౌశల్‌ కూడా ఉండబోతున్న నేపథ్యంలో కథ, కథనం మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. సినిమా విడుదల సమయంలోనూ చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

లవ్‌ అండ్‌ వార్‌ సినిమాలో నటించిన ముగ్గురు స్టార్స్‌కి కేవలం హిందీ మార్కెట్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయి మార్కెట్‌ ఉంది. యానిమల్‌ సినిమాతో రణబీర్‌ కపూర్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ అలరించిన విషయం తెల్సిందే. విక్కీ కౌశల్‌ ఛావా సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఇక ఆలియా భట్‌ సైతం సౌత్‌ ఇండియాలో గుర్తింపు ఉన్న నటి అనే విషయం తెల్సిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌ లో ఆలియా నటించడం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ముగ్గురి పాన్‌ ఇండియా క్రేజ్ కారణంగా లవ్‌ అండ్ వార్‌ సినిమా కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో సినిమాకు మినిమం పాజిటివ్‌ టాక్‌ వస్తే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత భారీ స్టార్‌ కాస్టింగ్‌ మూవీ కనుక కచ్చితంగా రూ.1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో మేకర్స్‌ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News