రాసి పెట్టుకోండి అంటూ రచ్చ లేపిన ఎన్టీఆర్..!

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అటెండ్ అవ్వడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈవెంట్ కి భారీ క్రేజ్ ఏర్పడింది.;

Update: 2025-04-13 03:32 GMT
రాసి పెట్టుకోండి అంటూ రచ్చ లేపిన ఎన్టీఆర్..!

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అటెండ్ అవ్వడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈవెంట్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నఫ్ వైజయంతి సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడంతో భారీ క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ కి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. సినిమా గురించి చెబుతూ రాసి పెట్టుకోండి చివరి 20 నిమిషాలు సినిమా మీకు కన్నీళ్లు తెప్పిస్తుందని.. నేను సినిమా చూశా క్లైమాక్స్ అందరినీ అలరిస్తుందని అన్నాడు ఎన్టీఆర్. ఐతే ఈసారి నేను మీకు కాలర్ ఎగరవేయడం కాదు అన్న కళ్యాణ్ రాం అన్న కాలర్ ఎగరేస్తా అంటూ కళ్యాణ్ రాం కాలర్ ఎగరేసి చెప్పాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ఎంట్రీనే ఈవెంట్ కి మంచి ఎనర్జీ తెచ్చింది. అదీగాక చాలా రోజులుగా ఫ్యాన్స్ ని ఇలా ఈవెంట్స్ లో కలవలేదు కాబట్టి ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ స్పీచ్ ఎప్పటిలానే ఫ్యాన్స్ ని ఫుల్ జోష్ లో నింపింది. అన్న కళ్యాణ్ రామ్ గురించి విజయశాంతి గురించి ప్రత్యేకంగా మాట్లాడి మెప్పించాడు.

ఎన్టీఆర్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. భారతదేశంలో ఏ నటి విజయశాంతి గారి లాంటి వైవిధ్యమైన పాత్రలు చేయలేదు. ఈ ఘనత ఆమె ఒక్కరికే దక్కిందని అన్నారు ఎన్టీఆర్. హీరోలతో సమానంగా నిలిచిన ఏకైక మహిళ విజయశాంతి గారు అని అన్నారు.

ఎన్టీఆర్ ఎనర్జీతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈవెంట్ కి ఫుల్ జోష్ తెచ్చింది. సినిమా ఇప్పటివరకు ఒక పాజిటివ్ బజ్ తో కొనసాగగా ఎన్టీఆర్ ఈవెంట్ కి రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఈవెంట్ లో పాల్గొని ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది.

Tags:    

Similar News