'మార్కో'ని టాలీవుడ్ రప్పిస్తున్నారా?
కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ హనీఫ్ ఓ చిత్రానికి చర్చలు జరుపుతుందిట. అది తెలుగు హీరో శర్వానంద్ తో తెరకెక్కించాలని ప్రణాళికతో ముందుకెళ్తుందిట.
ఇటీవల రిలీజ్ అయిన మలయాళ చిత్రం 'మార్కో' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని తెరెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అత్యంత వయోలెన్స్ తో తెరకెక్కించిన చిత్రం ఏ సర్టిపికెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మాలీవుడ్ కి గ్రాండ్ విక్టరీ అందించింది. 'యానిమల్' తరహా మేకింగ్ లా ఉన్నా ? క్రైమ్ ని మరింత బలంగా చెప్పిన చిత్రంగా నిలిచింది.
30 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమాబాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు సాధించింది. ఆ రకంగా మాలీవుడ్ కి అతి పెద్ద భారీ సక్సస్ ఇది. ఆర్ట్ సినిమాలతో వెల వెల బోయే మాలీవుడ్ ని మార్కో ఒక్కసారిగా పరిశ్రమ ఇమేజ్ ని మార్చేసింది. ఈ రేంజ్ యాక్షన్ ని ఇంతవరకూ ఇండియాలో ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు. తొలిసారి ప్రయత్నించి హనీఫ్ మంచి సక్సెస్ అయ్యాడు. దీంతో హనీఫ్ పై టాలీవుడ్ కన్ను పడిందని గుస గుస వినిపిస్తుంది.
అతడిని టాలీవుడ్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టిందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ హనీఫ్ ఓ చిత్రానికి చర్చలు జరుపుతుందిట. అది తెలుగు హీరో శర్వానంద్ తో తెరకెక్కించాలని ప్రణాళికతో ముందుకెళ్తుందిట. ఇటీవల సదరు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో హనీఫ్- శర్వానంద్ మధ్య చర్చలు జరిగినట్లు సన్నిహిత వర్గాల నుంచి లీకైంది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారుట. హొంబలే ఫిల్మ్స్ అంటే సినిమా పాన్ ఇండియాలోనే ఉంటుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. శర్వానంద్ కి కూడా సరైన హిట్ పడి చాలా కాలమవు తోంది. అతడు యాక్షన్ జానర్ సినిమాలు చేసి గ్యాప్ వచ్చింది. కొంత కాలంగా లవ్ స్టోరీలు..ఫ్యామిలీ స్టోరీలే చేస్తున్నాడు. అవి సో సోగా ఆడటం తప్ప శర్వా మాస్ ఇమేజ్ ని హైలైట్ చేయడం లేదు. మరి మార్కో డైరెక్టర్ తో సెట్ అయితే గనుక సీన్ వేరేలా ఉంటుంది.