భార్య వేధిస్తోందంటూ డైరెక్టర్ ఫిర్యాదు!
సెలబ్రిటీ భార్యాభర్తల మధ్య వివాదాలు కొత్తేం కాదు. రోజు రోజుకు విడాకుల కేసుల్లో వెలుగులోకి వస్తోన్న అంశాలు చూస్తుంటే దిమ్మ తిరిగే పరిస్థితే.
సెలబ్రిటీ భార్యాభర్తల మధ్య వివాదాలు కొత్తేం కాదు. రోజు రోజుకు విడాకుల కేసుల్లో వెలుగులోకి వస్తోన్న అంశాలు చూస్తుంటే దిమ్మ తిరిగే పరిస్థితే. తాజాగా మరో జంట రోడ్డుకెక్కింది. భార్య వేధిస్తుందంటూ దర్శకుడు భర్త ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కన్నడ నటి శషికళ-దర్శకుడు హర్షవర్దన్ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.
అనంతరం సహజీవనం మొదలు పెట్టారు. కొంత కాలానికి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకు రావడం, కాల్స్ రికార్డు చేయడం వంటి పనులతో బెదిరించిందని తాజా ఫిర్యాదులో పేర్కొన్నాడు. `పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాగార భావిలోని సినిమా ఆఫీస్ కు వచ్చి కారం పోడితో దాడి చేసిందని తెలిపాడు. 2022లో ఫిర్యాదు చేయగా అన్నపూర్ణేశ్రీ నగర పోలీసులు తనను అరెస్ట్ చేసినట్లు తెలిపాడు.
అలాగే సినిమా రంగంలో లేకుండా చేస్తానని కూడా శషికళ బెదిరించినట్లు వాపోయాడు. దీంతో 2022 మార్చిలో శషికళను హర్షవర్దను వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం అనంతరం ఆమె ప్రవర్తనలో మార్పులొ చ్చాయన్నాడు. ఇంటికి దర్శక, నిర్మాతలను తీసుకురావడం? అదేంటని ప్రశ్నిస్తే తనని బయటకు పంపి రెండు గంటలు గడిచిన తర్వాత ఇంటి లోపలికి రానిచ్చేదని అన్నాడు.
ఇలా తనతో రిలేషన్ మొదలైన నాటి నుంచి పెళ్లి జరిగిన వరకూ, నేటికీ రకరకాల వేధింపులకు భార్య పాల్పడు తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు శషికళతో పాటు అతడిపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.