వెండితెర హీరోలు తెర వెనక కష్టాలు..!

ఫ్యాన్స్ ను అలరించేందుకు హీరోలు పడే కష్టం.. వారు పెట్టే ఎఫర్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Update: 2024-09-29 11:30 GMT

తెర మీద అభిమాన హీరోలు చేస్తున్న సాహసోపేత ఫైట్ సీన్స్, యాక్షన్ ఘట్టాలు చూసి ఆహా ఓహో సూపర్ అని విజిల్స్ వేస్తాం కానీ వాటి వెనక వారి కష్టం గురించి అంతగా పట్టించుకోరు. అభిమానులను అలరించాలని స్టార్స్ ఎంత ఎఫర్ట్ పెడతారన్నది చెప్పడం కష్టం. తమకున్న కొన్ని అన్ హెల్త్ ప్రాబ్లమ్స్ లను కూడా దాటేసి తెర మీద అద్భుతాలు చేస్తుంటారు. సినిమా చేసేప్పుడు వారికి వచ్చిన హెల్త్ సమస్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు కష్టపడతారు.

ఫ్యాన్స్ ను అలరించేందుకు హీరోలు పడే కష్టం.. వారు పెట్టే ఎఫర్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందుగా సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం లో తన పాత్ర కోసం బీడీ కాల్చాడు. ఐతే ఎప్పుడో సిగరెట్ అలవాటు మానేసిన మహేష్ బీడీ తాగడం వల్ల తలనొప్పి రావడంతో విషయం అర్ధం చేసుకున్న త్రివిక్రం మహేష్ కోసం ఆయుర్వేద బీడీని సిద్ధం చేశారట. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మహేష్ ఆ సీన్స్ చేశారట. అంతేకాదు ఆ బీడీ తాగడం వల్ల తలనొప్పి సమస్య కూడా రాలేఅని తెలుస్తుంది.

దసరా సినిమా టైం లో నాని పడిన కష్టం అంతా తెర మీద కనిపించింది. దాదాపు సినిమా పూర్తయ్యే వరకు బొగ్గు గనుల్లోనే ఉన్నారు. యాక్షన్ సీన్స్ లో నాని కి మట్టి, బొగ్గు ధూళి అంతా ముక్కులోకి, శరీరంలోకి వెళ్లాయట. ఆ టైం లో కొన్ని హెల్త్ సమస్యలు వచ్చాయట. షూటింగ్ అయ్యాక రెండు నెలలు రెస్ట్ తీసుకుంటేనే కానీ అంతా సెట్ రైట్ అవ్వలేఅని అప్పట్లో నాని చెప్పారు.

పుష్ప రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ అందరికీ తెలిసిందే. ఐతే భుజం పైకెత్తి ఉండటం చాలా కష్టం అనిపించినా అలానే ఉన్నాడట అల్లు అర్జున్. అప్పటికీ షోల్డర్ కు రెండు మూడుసార్లు సర్జరీ జరిగినా కూడా క్యారెక్టర్ కోసం అలా ఉంచాల్సి వచ్చిందట. సినిమా కోసం తగ్గకూడదని అల్లు అర్జున్ అలా భుజం నొప్పి భరిస్తూ నటించారని తెలుస్తుంది.

యువ హీరో అడివి శేష్ నటించిన మేజర్ సినిమా షూటింగ్ ఫైర్ లో చేయాల్సి ఉంది. అయితే అనుకున్న లొకేషన్ ను ఆరోజు వేరే సినిమాకు ఇచ్చేశారట. ఆ సినిమా వాళ్లు వచ్చి తమని ఖాళీ చేయమని అడిగితే వారు ఒప్పుకోలేదట. మా సెట్ అంతా వాళ్లు తీసేసే దాకా వచ్చారు. ఐతే ఆ టైం లో కాస్త బాధ అనిపించిందని అన్నారు అడివి శేష్. ఐతే ఎలాగోలా ఆ క్లైమాక్స్ పార్ట్ ని షూట్ చేశామని అప్పట్లో చెప్పారు.

రానా కూడా అరణ్య సినిమా టైం లో తన ఎఫర్ట్స్ ను రిలీజ్ టైం లో చెప్పారు. కేరళ కారడవుల్లో సినిమా షూటింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి లొకేషన్ కి వెళ్లేవాళ్లం. దట్టమైన అడవి ఎంతో దూరం నడిచాం. కొండలు ఎక్కాం.. ఇదంతా ఒక ఎత్తైతే 150 కిలోల ఏనుగు తొండాన్ని తన భుజాన మోయాల్సి వచ్చింది. ఆ టైం లో అది చాలా నొప్పి అనిపించినా సీన్ పూర్తి చేసే దాకా అది భరించానని రానా చెప్పుకొచ్చారు.

అంతేకాదు RRR సినిమాలో నాటు నాటు డ్యాన్స్ సింక్ కోసం ఎన్ టీ ఆర్, చరణ్ లతో ఆ సాంగ్ ను 18 టేక్ లు చేయించాడట రాజమౌళి. మనకు కనిపించే అందమైన సీన్స్, యాక్షన్స్, ఫైట్స్ ఇంకా మరెన్నో వాటి వెనక మన హీరోలు పడే కష్టం తెలియదు. కానీ అవేవి ఆలోచించకుండా అలా ఒక్క మాటతో సినిమా గురించి ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం.

Tags:    

Similar News