రెండు నెలలుగా సెట్స్ కే వెళ్లలేదా?
ప్రస్తుతం చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమా చారం. అయితే ఇప్పుడు హీరో సహకరించని కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది.
స్టార్ హీరోల చిత్రాల విషయంలో అప్పుడప్పుడు కొంత స్తబ్ధత చోటు చేసుకుంటుంది. బయటకు ప్రచారం ఒకలా జరిగినా...లోపల జరిగే దానికి ..ప్రచారానికి ఏ సంబంధం ఉండదు. తాజాగా ఓ స్టార్ హీరో సినిమా విషయంలో ఇదే సన్నివేశం చోటు చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఓ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో పాన్ ఇండియాలో ఓ సినిమా పట్టాలెక్కింది. ఆ సినిమా కోసం హీరో దర్శకుడి ని పిండేసాడు.
హిట్ తప్ప మరో ఆలోచన లేకుండా సినిమా చేయాలి? అన్న ఆలోచనతో బలంగా ఉన్న హీరో స్టోరీ విషయంలో ఆ దర్శకుడి ని బాగానే ఇబ్బంది పెట్టాడు. చివరికి ఎలాగూ ఆ సినిమా సెట్స్ కివెళ్లింది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమా చారం. అయితే ఇప్పుడు హీరో సహకరించని కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది.
ఇప్పుడా సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటి? అంటే రెండు నెలలుగా ఆ స్టార్ హీరో సెట్స్ కే వెళ్లడం లేదుట. దీంతో దర్శకుడు హీరో లేని సన్నివేశాలు షూట్ చేస్తున్నాడుట. మరి హీరో ఎందుకు హాజరవ్వడం లేదంటే? అతనిపై పూర్తి స్థాయి సన్నివేశాలు లేకపోవడంతో కమిట్ అయిన మరో ప్రాజెక్ట్ షూట్ లో పాల్గొంటున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులో ఆ హీరోది నెగిటివ్ రోల్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది.
ఆ చిత్ర షూటింగ్ ప్రారంభమైన అప్పటికే రెండు నెలలు గడవడంతో ఆలస్యం చేస్తే బాగోదని భావించిన సదరు హీరో రెండు నెలలుగా ఆ సినిమా షూట్ లోనే పాల్గొంటున్నాడని సమాచారం. ఆ విషయం ఎక్కడా బయటకు రాకుండా హీరో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆ హీరో వ్యక్తిగతంగా కొన్ని రకాల విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ఇలాంటి సమయంలో మరో సినిమా షూట్ లో పాల్గోంటు న్నాడని ఆర్భాటం చేయోద్దని హీరో టీమ్ తో సూచించడంతోనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.