హాయ్ నాన్న బాక్సాఫీస్.. ఎంత వచ్చాయంటే..
నేచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు.
నేచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు. గతంలో కంటే ఇప్పుడు తన రేంజ్ ను పెంచుకున్న నాని.. తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుసా
నాని హాయ్ నాన్న చిత్రానికి నాలుగో రోజు అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.80 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.40కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు చెందిన శాటిలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ రూ.ఏడు కోట్లకు దక్కించుకుందట. నాని నటించిన సినిమాల శాటిలైట్ రైట్స్ అన్నింటినీ వరుసగా సన్ నెట్ వర్క్ దక్కించుకుంటోంది. ఇంతకుముందు నాని హీరోగా నటించిన మూడు సినిమాలు కూడా జెమినీ దగ్గరే ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా.. ఈ మూడు సినిమాల రైట్స్ దక్కించుకున్న ఈ సన్ నెట్ వర్క్ తా జాగా హాయ్ నాన్న శాటిలైట్ రైట్స్ కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. . జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.