నాని సినిమా షూటింగ్‌లో విషాదం

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న `హిట్ -3 సినిమా షూటింగ్ లో విషాదం నెల‌కొంది.

Update: 2025-01-01 08:05 GMT

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న `హిట్ -3 సినిమా షూటింగ్ లో విషాదం నెల‌కొంది. ఈ చిత్రానికి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కే.ఆర్ క్రిష్ణ గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేర‌గా విషాదక‌ర‌ మ‌ర‌ణం చిత్ర‌బృందానికి షాకిచ్చింది. మ‌హిళా సినిమాటోగ్రాఫ‌ర్ వ‌య‌సు 30 ఏళ్లు. పిన్న వ‌య‌సులో ఆమె మృతి చిత్ర‌బృందాన్ని క‌ల‌చివేసింది. ప్ర‌స్తుతం శ్రీ‌న‌గ‌ర్‌లో `హిట్ 3` షూటింగ్ జ‌రుగుతోంది.

ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేర‌గా కొంత మెరుగుదల సంకేతాలు కనిపించినా కానీ ఆమెను వార్డుకు తరలించినప్పుడు గుండె ఆగిపోయింద‌ని తెలుస్తోంది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వ‌ర్థ‌మాన మ‌హిళా సినిమాటోగ్రాఫ‌ర్ అకాల మరణాన్ని ప్రకటించి తమ సంతాపాన్ని తెలియజేసింది. కృష్ణ స్వ‌స్థ‌లం పెరుంబవూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అయిన సాను వర్గీస్, తొలుత త‌న సినిమాకి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫ‌ర్ గా కృష్ణ‌కు అవ‌కాశం క‌ల్పించారు. ప్ర‌స్తుతం కృష్ణ హిట్ 3 చిత్రానికి ప‌ని చేస్తున్నారు. చిత్ర‌బృందం క‌థ‌నం ప్ర‌కారం.. రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్‌లలో మునుపటి షెడ్యూల్‌లను పూర్తి చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో హిట్ 3 షూటింగ్ జ‌రుగుతోంది. షూటింగ్‌లో కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మొదట్లో ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటుపై శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగ‌వుతోంద‌ని సంకేతాలు ఉన్న క్ర‌మంలో పరిస్థితి గురించి తెలుసుకున్న ఆమె సోదరుడు శ్రీనగర్‌కు వెళ్లాడు. అయితే అనుకోని విధంగా సోమవారం ఆమెను వార్డుకు తరలించే క్రమంలో కృష్ణకు గుండెపోటు వచ్చింది. స‌హ‌చ‌రులు ఆమె మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News