నల్ల చీరలో ఇనయా.. ఇంకాస్త కొత్తగా..
రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిన విషయం తెలిసిందే. వారిలో ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా కూడా ఉంది.
రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిన విషయం తెలిసిందే. వారిలో ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా కూడా ఉంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఓ వీడియోతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆర్జీవీతో ఆమె డ్యాన్సులు, ఫోటోస్ చూసి అందరూ షాకయ్యారు. అప్పట్లో అవి నెట్టింట వేరే లెవెల్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో తెలుగు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ ఛాన్స్ అందుకుంది ఇనయా సుల్తానా.
బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందం, అభినయంతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. కుర్రాళ్లను ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ తర్వాత మంచి అవకాశాలు అందుకుంటుందని అంతా ఊహించినా.. అలా ఏం జరగలేదు. కానీ షో నుండి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. భారీగా తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.
నెట్టింట ఎప్పటికప్పుడు తన గ్లామర్ టాలెంట్ తో మెప్పిస్తుంటోంది అమ్మడు. క్రేజీ పిక్స్ ను షేర్ చేస్తుంటోంది. ఒక్కోసారి పద్ధతిగా.. మరోసారి హీట్ పుట్టించే విధంగా పోస్ట్ చేస్తుంటోంది. తన చూపులతో మాయ చేస్తుంటోంది. తన అందాల ఆరబోతతో ఫిదా చేస్తుంటోంది. గ్లామర్ గేట్లు పూర్తి ఎత్తేసి సందడి చేస్తుంటోంది. వెకేషన్ కు వెళ్తూ.. అక్కడ దిగిన చిత్రాలను తన ఫాలోవర్స్ కోసం పంచుకుంటూ ఉంటోంది. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటోంది.
తాజాగా బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీలో దిగిన పిక్స్ ను షేర్ చేసింది ఇనయా. బ్లాక్ లేడీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దొంగ చాటుగా నడుమును చూపిస్తూ మాయ చేసింది. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే.. సెగలు రేపింది. బ్యాక్ షో అండ్ తన అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇనయా పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడు పిక్స్ సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతూ.. ఆ సెక్షన్ ను నింపేస్తున్నారు. కొందరు షేర్ చేస్తుండగా.. మరికొందరు లైకులు కొడుతున్నారు.
ఇక అమ్మడు.. రీసెంట్ గా తన ప్రేమ విషయాన్ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ అండ్ యోగా ట్రైనర్ తో లవ్ లో ఉన్నట్లు వెల్లడించింది. ఇద్దరూ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను అప్పుడు షేర్ చేసింది. ఆ తర్వాత పలుమార్లు అతడితో కలిసి దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రియుడితో రొమాంటిక్ పోజులు ఇచ్చి సందడి చేసింది. మరి ఇనయా సుల్తానా.. వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగు పెడుతుందో వేచి చూడాలి.