ఆ సరైనోడు నాగ చైతన్యానేనా..?
బాలయ్యతో బోయపాటి శ్రీను సినిమాలు బాక్సులు బద్ధలు అవుతాయి. ఐతే మిగతా హీరోలకు కూడా బోయపాటి సూపర్ హిట్స్ ఇచ్చారు.
కొన్ని కాంబినేషన్స్ సినిమా అంటే చాలు ఆడియన్స్ లో ఒక వైబ్ ఏర్పడేలా చేస్తాయి. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఆ సినిమాల గురించి ఆడియన్స్ అంతా కూడా ఎగ్జైట్ అవుతుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా చేసినా సరే ఆ కాంబో సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుంది. బాలయ్యతో బోయపాటి శ్రీను సినిమాలు బాక్సులు బద్ధలు అవుతాయి. ఐతే మిగతా హీరోలకు కూడా బోయపాటి సూపర్ హిట్స్ ఇచ్చారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ కి బోయపాటి శ్రీను సరైనోడుతో సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు పుష్ప గా తన ఊర మాస్ యాటిట్యూడ్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అది సరైనోడు సినిమాలో బోయపాటి ఇచ్చిన బూస్టింగ్ అనే చెప్పొచ్చు. ఐతే అల్లు అరవింద్ బ్యానర్లో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. కానీ ఆ సినిమా ఇప్పటివరకు సెట్ అవ్వలేదు.
తాజాగా తండేల్ హిట్ తో అల్లు అరవింద్ కి ఒక క్లారిటీ వచ్చినట్టు ఉంది. అందుకే బోయపాటి శ్రీను సినిమాను నాగ చైతన్యతో లాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని హీరోల్లో తన పంథాలో సినిమాలు చేస్తూ వస్తున్న నాగ చైతన్య తండేల్ సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. తండేల్ ప్రెస్ మీట్ లోనే నాగ చైతన్యతో మరో మాస్ సినిమా చేస్తున్నామని చూచాయగా హింట్ ఇచ్చారు అల్లు అరవింద్.
ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను కాంబోలో నాగ చైతన్య హీరోగా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తనకు తండేల్ ఇచ్చిన అల్లు అరవింద్ తో నాగ చైతన్య ఎలాంటి సినిమా చేద్దామన్నా రెడీ అనేస్తున్నాడు. బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే నాగ చైతన్యతో సినిమా ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. మరి చైతన్యతో బోయపాటి సినిమా కన్ ఫర్మ్ అయితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కి అంతకుమించిన మాస్ ఫీస్ట్ మరోటి ఉండదని చెప్పొచ్చు.