ఫోక్ సాంగ్ కోసం చరణ్ గొంతు విప్పుతాడా?
ఈ సినిమా కోసం చరణ్ మూడేళ్లు టైమ్ వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయిపోయాడు. అంతటి స్టార్ డమ్ వచ్చాక చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేసిన గేమ్ ఛేంజర్ ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయంది. ఈ సినిమా కోసం చరణ్ మూడేళ్లు టైమ్ వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది.
దీంతో ఇప్పుడు చరణ్, ఆయన ఫ్యాన్స్ ఆశలన్నీ తర్వాత అతను చేస్తున్న ఆర్సీ16పైనే ఉన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే కథ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు చెప్పిన కథ ఎంతో నచ్చిందని, ఇలాంటి సినిమాకు పని చేయడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని రెహమాన్ సైతం ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పాడు. అంతేకాదు ఇప్పటికే రెహమాన్ ఈ సినిమా కోసం మూడు ట్యూన్లు సైతం రెడీ చేశాడని టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ పాటని హీరో రామ్ చరణ్ పాడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఫోక్ బిట్ సాంగ్‌ను హీరోతో పాడించాలనే ఉద్దేశంతో బుచ్చిబాబు రామ్ చరణ్ ను కన్విన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒకవేళ చరణ్ ఈ పాట పాడితే మాత్రం సినిమాకు మరో అదనపు ఎట్రాక్షన్ తోడైనట్టే.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆర్సీ16 ఇవాల్టి నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ లుక్ లో అవతారమిస్తాడని టాక్ వినిపిస్తోంది.