ఇండియాలోనే రిచెస్ట్ ప్రొడ్యూసర్ ఈయనేనా!
ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అత్యధికంగా సంపాదించే హీరో ఎవరు?
భారత్ లో అత్యంత ధనవంతుడైనా నిర్మాత ఎవరు? అంటే ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అత్యధికంగా సంపాదించే హీరో ఎవరు? ఏ హీరో ఎంత పారితోషికం తీసుకుంటాడు? ఎన్ని కోట్లు వేనకేసాడు? అతడి ఆస్తుల విలువ ఎంత? అంటూ హీరోలు చూట్టూని తిరుగుతారు కానీ.. .నిర్మాతల్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అలా చూసుకుంటే అంత బడా నిర్మాత సౌత్ నుంచి ఎవరు ఉంటారు? అది బాలీవుడ్ నుంచే ఆ ఛాన్స్ ఉంటుందనుకోవడం సహజం. కానీ అది తప్పు.
ధనవంతుడైన ఆ నిర్మాత ఎవరు? అందులో నెంబవర్ వన్ స్థానం ఎవరిది? అంటే తమిళనాడుకు చెందిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అని తెలుస్తోంది. భారత్ లోనే రిచెస్ట్ ప్రొడ్యూసర్ గా ఆయన రికార్డుకు ఎక్కారు. అక్షరాల ఆయన ఆస్తుల విలువ రూ.30వేల కోట్లకు పైనే. ఒకప్పుడు ఈయన్ని ఇండియన్ బిల్ గేట్స్ గా పిలిచేవారు అని ఎంత మందికి తెలుసు? ఫోర్బ్స్ రిపోర్ట్స్ ప్రకారం కళానిధి మారన్ వద్ద దాదాపు రూ.30 వేల కోట్ల డబ్బు ఉంది.
మారన్ సన్ గ్రూప్ అనేది అతి పెద్ద మీడియా సంస్థ. 37 టీవీ ఛానెళ్లు ఈ సంస్థకు చెందినవే. సన్ పిక్చర్స్ అనే సినిమా నిర్మాణ సంస్థ కూడా సన్ గ్రూప్‌లో భాగమే. రెండవ నిర్మాత బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా. ఆయన ఆస్తి విలువ అక్షరాలా రూ.13 వేల కోట్లు. ఆ లెక్కన చూస్తే సెలబ్రిటీ పరంగా చూసినా అత్యంత ధనవంతుడు కళానిధి మారన్ అవుతారు. ఆదిత్య చోప్రాకు దాదాపు రూ.7,480 కోట్ల ఆస్తి ఉంటే, భూషణ్ కుమార్‌కు దాదాపు రూ.7,985 కోట్ల ఆస్తి ఉంది.
రిచెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ రూ.7,313 కోట్లు. షారుఖ్ ఖాన్ ఆస్తి కంటే కళానిధి మారన్ ఆస్తి నాలుగు రెట్లు ఎక్కువ. కళానిధి మారన్ ది ఆషామాషీ బ్యాక్ గ్రౌండ్ కాదు. కళానిధి మారన్ మురసోలి మారన్ కుమారుడు. మురసోలి మారన్ ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కళానిధి మారన్ 26వ ఏటే వ్యాపార రంగంలోకి వచ్చారు. తండ్రి నుంచి వచ్చిన చిన్న వ్యాపారాన్ని చేజిక్కించుకుని దాన్ని అతిపెద్ద నెట్ వర్క్ గా మార్చారు. 1993లో సన్ టీవీని స్థాపించారు. ప్రస్తుతం సన్ టీవీ బిగ్గెస్ట్ టీవీ నెట్‌వర్క్‌గా మారింది.