కల్తీ సారా వ్యవహారంపై కమల్ వింత వ్యాఖ్యలు... ట్రోలింగ్ స్టార్ట్!

తమిళనాడులోని కల్తీ సారా ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-24 07:20 GMT

తమిళనాడులోని కల్తీసారా ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం జాతీయస్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో వీలైనంత జాగ్రత్తగా స్పందించాల్సిన ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ట్రోలింగ్ మొదలైపోయింది.

అవును... తమిళనాదులో కల్తీసారా వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఈ విషయంలో బాధితులదే పూర్తిగా తప్పు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది. బాధితులు అజాగ్రత్తగా ప్రవర్తించారు, పరిమితిని మించిపోయారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తాజాగా కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామశించిన సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫార్మసీ స్టోర్లకన్నా మద్యం రిటైల్ అవుట్ లెట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే బాధితులపై సానుభూతి చూపించకుండా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు!

ఇందులో భాగంగా... కల్తీసారా ఘటనలోని బాధితుల పట్ల నాకు సానుభూతి లేదని చెప్పను కానీ వారంతా తమ పరిమితిని మించిపోయారని అర్థం చేసుకోవాలి అంటూ కమల్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... వారంతా చాలా అజాగ్రత్తగా ప్రవర్తించారని.. ఎవరైనా సరే ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని.. మద్యపానం అలవాటు అకేషనల్ గా ఉండాలని చెప్పుకొచ్చారు.

దీంతో... కమల్ వ్యాఖ్యలపై విమర్శలు మొదలైపోయాయి. అసలు రాష్ట్రంలో కల్తీసారాను అరికట్టాల్సిన డీఎంకే ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయకుండా బాధితులనే పూర్తిగా తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు కమల్ పై ఫైరవుతున్నారు.

Tags:    

Similar News