ఆసుపత్రిలో హీరో..ఆపరేషన్ చేయాలంటున్నారా?
మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ మధ్యంత బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ మధ్యంత బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా కోర్టు ఆరు వారాల పాటు ఈ బెయిల్ మంజూరు చేసింది. తాజాగా దర్శన్ ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్ నాగేశ్ తెలిపారు. దర్శన్ కు వెన్నులో ఎల్ -5, ఎస్-1 డిస్క్ ల సమస్య ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం మైసూరు లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో దర్శన్ కి చికిత్సం అందిస్తున్నట్లు తెలిపారు.
దర్శన్ ఆరోగ్యంపై ఆసుపత్రి డాక్టర్లు కూడా స్పందించారు. దర్శన్ కాలు శక్తి పూర్తిగా కోల్పోయింది. వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలికి కూడా ఆ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ప్రాధమిక చికిత్స మొదలు పెట్టాం. ఇంకా చాలా రిపోర్టులు రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాలా? లేదా? అన్నది తెలుస్తుంది. ఆపరేషన్ పడుతుందని అతడి బాధని బట్టి తెలుస్తోంది. బళ్లారి సెంట్రల్ జైలు వైద్యులు పంపిన రిపోర్టులు కూడా పరిశీలిస్తున్నాం` అని తెలిపారు.
దర్శన్ కి కోర్టు ఆరు వారాలు మాత్రమే గడువు ఇచ్చింది. ఈలోపు చికిత్స మొత్తం పూర్తి చేసుకుని మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికీ చికిత్స పూర్తవ్వకపోతే బెయిల్ పోడిగిస్తారా? లేదా? అన్నది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి ఆయన భార్య బెయిల్ కోసం శత విధాల ప్రయ త్నించారు. కానీ ఏం లాభం లేకపోయింది. చివరికి అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చాడు.
దాదాపు 140 రోజుల పాటు దర్శన్ జైల్లోనే ఉన్నాడు. తొలుత పర్పన్ అగ్రహారం జైలులో ఉంచగా అక్కడ నుంచి బళ్లారి కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే. దర్శన్ అరెస్ట్ తో ఆయన నటించాల్సిన సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మర్దర్ కేసు కావడంతోనే బెయిల్ దొరకడం లేదు. గతంలో సంజయ్ దత్ కూడా ఓకేసులో అరెస్ట్ అవ్వగా షూటింగ్ కోసం కోర్టు కొంత వెసులు బాటు కల్పించడంతో వాటిని పూర్తి చేసి వచ్చిన సంగతి తెలిసిందే.