కార్తీ 29.. సరైన టైమ్ కు సరైన మూవీ!

గత ఏడాది సత్యం సుందరం మూవీతో మంచి హిట్ అందుకున్నారు.

Update: 2025-02-08 12:44 GMT

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన.. ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. గత ఏడాది సత్యం సుందరం మూవీతో మంచి హిట్ అందుకున్నారు. రీసెంట్ గా సూర్య కంగువాలో క్యామియో రోల్ తో మెప్పించారు.


ఇటీవల వా వాతియ‌ర్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. సర్దార్ -2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే గత ఏడాది మరో సినిమాను కార్తీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాన‌క్క‌ర‌న్ సినిమా ఫేమ్ ద‌ర్శ‌కుడు త‌మిళ్ (Tamizh)తో వర్క్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ఓ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

మోషన్ పోస్ట‌ర్‌ లో ఒక భారీ ఓడ స‌ముద్రంలో వెళుతున్న‌ట్లుగా ఉండగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. పీరియాడికల్ బ్యాక్‌ డ్రాప్‌ లో రాబోతున్న కార్తీ 29 ప్రాజెక్టును డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌ పై SR ప్రకాష్‌ బాబు, SR ప్రభు సంయుక్తంగా గ్రాండ్ నిర్మిస్తున్నారు. అయితే ఆ బ్యాన‌ర్‌ లో ఇప్ప‌టికే కార్తీ ధీరన్ అధిగారమ్ ఒండ్రు(ఖాకీ)తో పాటు సుల్తాన్, కాష్మోరా, జ‌పాన్ పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు.

దీంతో కార్తీ 29పై అనౌన్స్మెంట్ తోనే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ టచ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. అదే సమయంలో చిత్రంలో ప్రముఖ నటుడు వడివేలు కీలక పాత్ర పోషిస్తున్నారట.

అయితే చాలా కాలం తర్వాత కార్తీ.. రా అండ్ రస్టిక్ జోనర్ లో సినిమా చేస్తున్నారనే చెప్పాలి. తనదైన యాక్షన్ తో అదరగొట్టే ఆయనలోని టాలెంట్ ను మరోసారి కార్తీ 29 మూవీ వెలికితీయనుందని సినీ పండితులు చెబుతున్నారు. కచ్చితంగా సవాలుతో కూడిన క్యారెక్టర్.. ఆయనకు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు.

ఏదేమైనా కెరీర్ పీక్స్ లో ఉన్న ఆయన.. సరైన టైమ్ సరైన జోనర్ సెలెక్ట్ చేసుకున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్తీ 29 ప్రాజెక్ట్ జోనర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News