ఖైదీ 2 కంటే ముందే.. ఆ క్రేజీ సీక్వెల్!

తమిళ్ స్టార్ హీరో కార్తీ డిఫరెంట్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు

Update: 2024-07-03 04:00 GMT

తమిళ్ స్టార్ హీరో కార్తీ డిఫరెంట్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. తెలుగులో ఊపిరి, తమిళంలో ఖాకీ, ఖైదీ సినిమాలు ఆయన కెరియర్ లో చేసిన బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. మొదటి సినిమా యుగానికి ఒక్కడులో కూడా కార్తి బలమైన క్యారెక్టర్ చేసి మెప్పించాడు. అయితే ఖాకీ, ఖైదీ సినిమాలు కార్తిని స్టార్ గా నిలబెట్టాయి. “ఖైదీ” మూవీ అయితే ట్రెండ్ సెట్ మూవీ అని చెప్పొచ్చు.

లోకేష్ కనగరాజ్ రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి అతన్ని ఏకంగా స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. కేవలం ఒక్క రాత్రిలోనే జరిగిన కథగా ‘ఖైదీ’ సినిమాని లోకేష్ కనగరాజ్ చూపించారు. అయితే స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేసి ప్రేక్షకులని కట్టిపడేసాడు. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకుల మనస్సులో బలమైన ముద్ర వేసుకున్నాయి.

అందులో కార్తి ప్లేట్ లో బిర్యాని వేసుకొని తినే సీన్ ఒకటి. ఇప్పటికి ఈ సీన్ సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. ఖైదీకి సీక్వెల్ కూడా ఉంటుందని లోకేష్ కనగరాజ్ చెప్పారు. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని కూడా ఖైదీతో స్టార్ట్ చేసి అందులో ‘విక్రమ్’ మూవీ తీశారు. ఆ సినిమా క్లైమాక్స్ లో ఖైదీకి లీడ్ ఇచ్చారు.

అలాగే విజయ్ ‘లియో’ సినిమాని సినిమాటిక్ యూనివర్స్ లో చేసి విక్రమ్ కి లీడ్ ఇచ్చారు. ఖైదీ సీక్వెల్ లోకేష్ స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్ తో ‘కూలి’ మూవీ స్టార్ట్ చేశారు. దీని తర్వాత విక్రమ్ సీక్వెల్ లేదంటే ప్రభాస్ తో మూవీ చేసే అవకాశం ఉందంట. ఈ సినిమాల తర్వాత ఖైదీ సీక్వెల్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందంట.

అయితే కార్తి తాజాగా ‘సర్దార్ 2’ మూవీ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ మూవీ 2022లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే దర్శకుడితో సర్దార్ 2ని పట్టాలు ఎక్కించే పనిలో కార్తి ఉన్నారు. అలాగే కార్తి లైన్ అప్ లో ‘ఖాకీ’ మూవీ సీక్వెల్ కూడా ఉండటం విశేషం. మరి లోకేష్ ఖైదీ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్ నాట గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News

eac